Kalabhairava ashtakam in telugu PDF

Kalabhairava ashtakam in telugu PDF download it by given below link.

Kalabhairava ashtakam in telugu PDF

Kalabhairava ashtakam in telugu PDF

➥ Kalabhairava ashtakam in telugu PDF

Kalabhairava ashtakam in telugu

కాలభైరవ అష్టకం

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్||

నారదాదియోగివృణ్డవందితం దిగంబరం
కాశికాపురాధీనాథాకాలభైరవం భజే||

భానుకోఠిభస్వరం భవాబ్ధితారక పరం
నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనమ్||

కాలకలమంబుజాక్షమాక్షశూలమాక్షరం
కాశికాపురాధీనాథాకాలభైరవం భజే||

శూలతంకపాశడఁడపాణిమదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిర్మయమ్||

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియమ్
కాశికాపురాధీనాథాకాలభైరవం భజే||

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహం||

వినిక్వాన్మనోజ్ఞహేమకింకిణీలసత్కఠిం
కాశికాపురాధీనాథాకాలభైరవం భజే||

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్||

స్వర్ణవర్ణశేషపాశాశోభితాంగమండలం
కాశికాపురాధీనాథాకాలభైరవం భజే||

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్ఠదైవతః నిరఞ్జనమ్||

మృత్యుదర్పణాశనం కరాళదంష్రమోక్షణం
కాశికాపురాధీనాథాకాలభైరవం భజే||

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతి
దృష్ఠిపాటనష్టాపాజలముగ్రశాసనమ్||

అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధారం
కాశికాపురాధీనాథాకాలభైరవం భజే||

భూతసంఘనయకం విశాలకీర్తిదాయకం
కాశివాసాలోకపుణ్యపాపశోధకం విభుమ్||

నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతి
కాశికాపురాధీనాథాకాలభైరవం భజే||

కాలభైరవసంతకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్||

శోకామోహదైన్’యాలోభకోపతాపనాశనమ్
ప్రయాంతి కాలభైరవంఘ్రిసన్నిధిం నర ధ్రువం||

ఎలాంటి భాయాలున్న క్షణం లో పోగట్టే కాలభైర

(అష్టకం) వుడు

మన భారత దేశం లో ఉన్న హిందువుల ఆరాధ్యదైవం కాల భైరవడు. అంతే కాదు శివుని భీకర రూపంలో ఉన్న అభివ్యక్తిగా నమ్ముతారు చాల మంది. ఈ కాలభైరవుడు కు దండపాణి, స్వస్వ వంటి పేర్లు కూడా ఉన్నాయి. మార్గశీర్ష మాసంలో కృష్ణ పక్షం లో అష్టమి తిథి రోజున శివుని అవతారం ఏర్పడిందని భక్తుల విశ్వాసం. ఈయనను ఆరాధించే వారు ఎక్కువగా భారతదేశం, నేపాల్ మరియు శ్రీలంక వంటి దేశాలలో ఇప్పటికి ఉన్నారు. అంతే కాదు టిబెటియన్లు మరియు బౌద్ధ మతస్డులు కూడా ఆయనను ఎక్కువగా ఆరాధిస్తారు.ఎక్కడైతే శక్తిపీఠం లేదా శక్తి దేవాలయాలు ఉన్నాయో వాటిని కాపాడేందుకు శివుడు కాల భైరవ రూపాన్ని ధరించాడని నమ్ముతారు చాలా మంది భక్తులు. ప్రతీ శక్తి దేవాలయాలలో ఎప్పుడూ భైరవ దేవాలయం కుడా ఉంటుంది. భైరవుడు అనేవాడు శివునిచే సృష్టించబడ్డాడని, మరికొందరు అతని కుమారులలో ఒకడని మరొక పురాతన నమ్మకంగా కుడా ఉంది

కాల భైరవుని శక్తులు గురించి తెలుసుకోవాలంటే ప్రతీ శివాలయాల్లో, భైరవ విగ్రహాలను ఉత్తరాన, పశ్చిమ ముఖంగా ఏర్పాటు చేస్తారు. ఈ కాలభైరవుడి రూపం నాలుగు చేతులతో నిలబడి ఉన్న విగ్రహం గా ఉంటుంది. ఈ కాలభైరవుడి ఆయుధాలను చూసినట్లయితే డోలు, పాము, త్రిశూలం మరియు పుర్రె తో పాటు ఆయనతో ఒక కుక్క అలాగే బంగారు పాత్ర కూడా ఉంటాయి. ఈయన రూపం చాలా భయంకరంగా ఉంటుంది. శివాలయాలు ఉన్న ప్రతీ చోటా సాధారణ పూజ సూర్యునితో ప్రారంభమై భైరవుని పూజతో ముగిస్తారు. ఈయనకు మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చెయ్యడం అలాగే ఆరాధించడం వల్ల ఎటువంటి కీడు లు ఉన్న భూత ప్రేత భయాలు ఉన్న అవి తొలగి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అలాగే ఎన్నో మనకు కావలిసిన, ఎలాంటి కోరికలు ఉన్న ఆయన అనుగ్రహం వల్ల మనకు అన్ని లభిస్తాయని వేద పండితులు చెప్తున్నారు.

ఇక్కడ ఇంకో విశేషం గురుంచి చెప్పాలి, శివాలయాలు ఉన్న చోట రాత్రి సమయంలో ఆలయం మూసిన తర్వాత ఆ తాళాలు భైరవ స్వామి ముందు ఉంచుతారు. భక్తులు భైరవుడిని ఆరాధించడం వల్ల ఎలాంటి వారికైనా శ్రేయస్సుతో పాటు , విజయం , అలాగే మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారని వేద పండితులు చెప్తున్నారు. అలాగే దీర్ఘాయువును కూడా పొందుతారని, ఆర్థిక సమస్యలు కుడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ కాలభైరవుడు మానవుని లో ఉండే కామం, దురాశ, భయం వంటి చెడులను నాశనం చేస్తాడని భక్తులు బాగా నమ్ముతారు. ఎవరైనా తన సహాయం కోరే వాళ్ళను అలాగే బలహీనమైన స్త్రీలను రక్షిస్తాడు మారొక నమ్మకం ఉంది భక్తులలో. ఈ స్వామిని ఎలాంటి కోరికలు కోరాలన్నా మంచి అనుకూల సమయం అర్ధరాత్రి, ముఖ్యంగా శుక్రవారం రాత్రి అయితే విశేష ఫలితాలు ఉంటాయని వేద పండితులు చెప్తున్నారు.

You may also like:

Runa vimochana narasimha stotram in telugu PDF

Annapurne sadapurne mantra in telugu pdf

Hanuman dandakam in telugu pdf

Bajrang baan in telugu PDF

Ganapathi ashtothram in telugu

Leave a Comment