Ganapathi ashtothram in telugu

Ganapathi ashtothram in telugu PDF download it by given below link.

Ganapathi ashtothram in telugu

Ganapathi ashtothram in telugu PDF:

➥ Ganapathi ashtothram in telugu

గణేశ అష్టోత్తర శత నామావళి

ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః (10)

ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః (20)

ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః (30)

ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః (40)

ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః (50)

ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః (60)

ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవనప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః (70)

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః (80)

ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః (90)

ఓం సఖయే నమః
ఓం సరసాంబు నిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
ఓం సమస్తదేవతా మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాత కారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః (100)

ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్త్వెశ్వర్యప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)

Ganapathi ashtothram in telugu: How to read

గణపతి ని పూజించడం వల్ల కలిగే లాభాలు ఇలాగె ఉంటాయి

మనం ఏ శుభకార్యం తలపెట్టిన ముందు గణపతి ని పూజిస్తే కాని మిగిలిన పనులు చెయ్యం. ఈ గణపతిని పూజించడం వల్ల మనం చేసే కార్యాలకు ఎటువంటి అవరోధాలు రాకుండా మన పని విజయవంతం కావాలని ప్రప్రధమం గా ఆ వినాయకుడిని ప్రార్దిస్తాం. ఆయన అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో కొలిచినట్లయితే ఆ గణనాయకుడు అనుగ్రహం తప్పక లభిస్తుంది. మనకు ఎదురయ్యే ఎటువంటి కష్టాలనైనా వాటిని నాశనం చేసి మనకు మనశ్శాంతి ని ప్రసాదిస్తాడు. ఎంతటి సమస్యలు వచ్చిన మన బుద్దిబలంతో వాటిని జయించే శక్తీ ని ఇస్తాడు.

గణపతికి గరిక అంటే చాల ఇష్టం. ఆ గణపతి కి బుధవారం రోజున గరికను సమర్పిస్తే ఆర్ధిక ఇబ్బందులు పోయి సుఖ సంతోషాలతో ఉండగల్గుతాం. అంతే కాదు ఆ గణపతికి బూంది లడ్డు తో పాటు బెల్లం,ఆవునెయ్యి కనక నైవేద్యం గా పెడితే మిక్కిలి సంత్రుప్తుడై దీర్ఘాయువును ప్రసాదిస్తాడని శాస్త్రాలలో చెప్పడం జరిగింది. అంతే కాదు నైవేద్యం గా సమర్పించిన ఈ పదార్ధాలను ఆవుకి తినిపించినట్లయితే సమస్త లాభాలు చేకూరతాయిని ఋషులు చెప్పడం జరిగింది.

ఈ గజాననుడు కి ఉండ్రాళ్ళు అంటే మహా ఇష్టం, అందుకని బుదవారం రోజున ఈ ఉండ్రాళ్ళు నైవేద్యం గా సమర్పిస్తే అనుకున్న కార్యాలు అలాగే కోరికలు నెరవేరతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే బుధవారం రోజునే రావి ఆకులు తో పాటు సిందూరం గణపతికి సమర్పించినట్లయితే మన జాతక దోషాలు తొలగి పోయి అన్ని మంచి శుభాలు కల్గుతాయని ఈ విషయం పలు గ్రంధాలలో ఉందని పండితులు చెబుతున్నారు

వినాయకుని గురించి చెప్పాలంటే తల నుంచి పాదాల దాక ఒక్కక్క అవయానికి ఒక్క విశేషం ఉంది
అది ఏంటో తెలుసా…..

1.పెద్ద తల –పెద్దగా ఆలోచించి సరైన నిర్ణయాలను తీసుకోవడానికి సూచన.
2.చిన్న కళ్లు – అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి సూచన.
3.చిన్న నోరు – అవసరానికి తగినంత మాట్లాడడానికి సూచన.
4.పెద్ద చెవులు – అన్ని మాటలను వినండి, అనవసరమైన వాటిని విస్మరించండి.
5.విరిగిన దంతం – వ్యతిరేకతలను అధిగమించండి.
6.పెద్ద పొట్ట – మంచి మరియు చెడు అన్ని విషయాలను జీర్ణించుకోవడానికి
7.లడ్డూలు – విజయానికి బహుమతి.
8.చిన్న మూషికం – మనకున్న కోరికలకు చిహ్నం. కోరికలను మనం నడిపించాలి కానీ కోరికలు మనల్ని నడిపించకూడదు.
9.ఒక కాలు ముడుచుకొని ఇంకో కాలు నేలపై – ప్రపంచాన్ని మరియు దాని ఆనందాలను అనుభవిస్తున్నప్పుడు, నిర్లిప్తంగా ఉండాలి మరియు నిరంతరం తన అంతరంగాన్ని వెతకాలి.
10.అభయ ముద్ర – అందరిని బుద్ధి, ఆశ్రయం మరియు రక్షణ ఉండేలా అనుగ్రహించడం.

Leave a Comment