Ayushman Card Apply Online 2024: ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిరు పేదలకు ఒక అధ్బుతమైన పధకం తీసుకొచ్చింది. ఇప్పటకే కేంద్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య అవసరాల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది, అందులో ముఖ్యమైనది జాతీయ ఆరోగ్య పథకం అయితే రెండవది ఆయుష్మాన్ భారత్. ఈరోజు ఈ రెండు పధకాల వల్ల ఎంతో మంది లబ్ది పొందుతున్నారనే చెప్పాలి. ఇప్పుడు ఈ పథకం కింద భారతదేశంలోని వివిధ ప్రభుత్వ – ప్రాయోజిత ఆరోగ్య బీమా పథకాల కింద ఎన్నో ప్రయోజనాలు ఎల్లప్పుడూ పేదలకు అందే విధం గా ప్రణాళికలు తయారుచేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి సంవత్సరానికి రూ. 30,000 నుండి రూ. 3,00,000 వరకు పరిమితి ఉండేది. PM-JAY విడుదల చేసిన జాబితా లో ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ పరిస్థితుల కోసం అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి సంవత్సరానికి రూ. 5,00,000 వరకు నగదు రహిత కవరేజీని అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ స్కీమ్ కింద కవర్ అయ్యే చికిత్స లు అలాగే క్రింది తెలిపిన అన్ని అంశాలు కోసం అయ్యే అన్ని ఖర్చులు అన్ని ఈ కార్డు పరిధి లోకి వస్తాయి.
Ayushman Card Application eligibility:
1.వైద్య పరీక్ష, చికిత్స మరియు కౌన్సెలింగ్
2.ఆసుపత్రిలో చేరే ముందు మందులు మరియు వైద్య సామాగ్రి వివరాలు
3.నాన్-అక్యూట్ మరియు అక్యూట్ కేర్ సేవలు
4.రోగనిర్ధారణ మరియు ప్రయోగశాల పరిశోధనలు
5.మెడికల్ ఇంప్లాంట్ సేవలు (అవసరమైతే)
6.వసతి సౌకర్యాలు
7.ఆహార సేవలు
8.చికిత్స సమయంలో వచ్చే ఇతర సమస్యలు
9.ఆసుపత్రిలో చేరిన తర్వాత 15 రోజుల పాటు తదుపరి సంరక్షణ
అయితే వీటి అన్నింటికీ ఆయుష్మాన్ కార్డు కాని లేదా ఇప్పుడు కొత్తగా జారీ చేసిన కార్డు కాని ఉండాలి. ఒకవేళ ఏ కార్డు లేకపోయినట్లయితే వెంటనే ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి కోసం
ఈ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. వాటి జిరాక్స్ కాపీలను జత చేసి దరఖాస్తు తో పంపాలి.
Ayushman Card Application requirement:
1.రేషన్ కార్డు
2.ఆధార్ కార్డు
3.ఆదాయ ధృవీకరణ పత్రం
4.ఫోటోలు రెండు
5.నివాస ధృవీకరణ పత్రం
6.మొబైల్ నెం
7.కుటుంబ సభ్యులందరి రికార్డులు
ఆయుష్మాన్ భారత్ కార్డ్ యొక్క ప్రయోజనాలు :
వివిధ ఆసుపత్రులలో లభించే పలు రకాల వ్యాధులకు చికిత్సలకు కవరేజ్. అలాగే ఈ కార్డు ద్వారా యాక్సెస్ సేవలు మరియు ఉచిత చికిత్స అందించడం. అంతేకాకుండా ఈ కార్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది.
15 రోజుల ఆసుపత్రి ఖర్చుల కవరేజీ ఇందులో పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ కార్డ్ 2024 కొరకు ఈ అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించి వివరాలు తెలుసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి: https://pmjay.gov.in/ ఈ వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి మీ వివార్లు నమోదు చేసుకోవాలి.
You may Like:
Free Sewing Machine Scheme 2024