PM suryoday yojana apply online: ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన – లాభాలు – ఎలా అప్లయ్ చేసుకోవాలి
ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన 2024 కారణంగా రాబోయే కాలంలో భారతదేశం పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించే పెద్ద దేశంగా ఆవిర్భవించబోతోంది. దీనివల్ల దేశం లో ఉన్న పేద ప్రజలకు వారి గృహ అవసరాలకు విధ్యత్ అందించాలనే ఉద్దేశ్యం తో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు అమలు లోకి తీసుకొచ్చింది.
అంతే కాదు వీరు ఏర్పాటు చేసుకున్న సోలార్ విద్యత్ మిషన్ వల్ల దీని నుండి ఉత్పత్తి అయిన పూర్తి విద్యుత్ గృహ అవసరాలకు సరిపోగా మిగిలిన విధ్యత్ ను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. దీని వల్ల మీ ఇంటికి ఉచితం గా విద్యుత్ పొందడంతో పాటు తిరిగి మిగిలిన విద్యుత్ ను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు ద్వార మీకు కొంత డబ్బు మీ బ్యాంకు అకౌంట్ కు జమ చేస్తారు.
Contents
- 1 ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన ప్రధాన లక్ష్యం :
- 2 ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన (PMSY) ప్రయోజనాలు :
- 3 ప్రధాన మంత్రి సూర్యోదయ పథకం – ముఖ్యాంశాలు :
- 4 PMSY – అవసరమైన పత్రాలు :
- 5 PM సూర్యోదయ్ యోజన అధికారిక వెబ్‌సైట్ :
- 6 PM సూర్యోదయ యోజన కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి – PM suryoday yojana apply online
- 7 Contact Details – సంప్రదించాల్సిన వివరాలు
ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన ప్రధాన లక్ష్యం :
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రధాన మంత్రి సూర్యోదయ్ పథకం యొక్క ఏకైక లక్ష్యం భారతదేశంలోని కనీసం కోటి కుటుంబాలకు ఈ పథకం క్రింద కు తీసుకు వచ్చి వారికి లబ్ది చేకూరే విధం గా విద్యుత్ సదుపాయం కల్పించాలనే సంకల్పం తో తీసుకొచ్చిన పధకం ఇది. ఈ పధకం ద్వారా పేద మరియు మధ్యతరహా కేటగిరీ కిందకు వచ్చే కుటుంబాలు డిస్కమ్ కంపెనీ ఇచ్చే కరెంట్ బిల్లులలో ఉపశమనం కలుగుతుంది.
ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన (PMSY) ప్రయోజనాలు :
1.ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన (PMSY) కారణంగా భారతదేశం ఇంధన రంగంలో స్వావలంబన సాధించి మరియు శక్తి వంతంగా మారడానికి అవకాశం ఉంటుంది.
2.ఈ పధకంలో చేరిన పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇక మీదట వచ్చే అధిక కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు.
3.ఈ పధకం లో చేరిన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా సబ్సిడీ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
4.ప్రధానమంత్రి సూర్యోదయ్ పథకం 2024 కింద, దేశంలోని 1 కోటి కుటుంబాలకు ఈ పధకం వల్ల ప్రయోజనం చేకూరుతుంది.
5.లబ్దిదారుల ఇంటిలో సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్లను అమర్చిన తర్వాత, లబ్ధిదారుడు తన ఇంట్లో వారి గృహ అవసరాల మేరకు మరిన్ని లైట్లు, ఫ్యాన్లు కూడా ఉపయోగించుకో గలుగుతారు.
6.PM సూర్యోదయ యోజనలో ఆన్‌లైన్ దరఖాస్తు సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తద్వారా లబ్ధిదారుడు తన ఇంటి వద్ద కూర్చొని ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు చేసుకోవడం ద్వారా మరింత సబ్సిడీ ప్రయోజనాన్ని పొందవచ్చు.
ప్రధాన మంత్రి సూర్యోదయ పథకం – ముఖ్యాంశాలు :
మీరు కూడా PM సోలార్ రూఫ్‌టాప్ యోజన ప్రయోజనాలను పొందాలనుకుంటే, ముందుగా ఈ పథకంలో నమోదు చేసుకున్న తర్వాత మనకు ఎంత సబ్సిడీ లభిస్తుందో మీరు చూడవలసి ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద సబ్సిడీ మొత్తం మీరు ఎన్ని కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌లను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అన్ని వివరాలు లబ్దిదారులకు అందజేస్తుంది. అందువల్ల, మీరు PM సూర్యఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన సబ్సిడీ లింక్ ద్వారా మీకు కావలసిన సహాయం తీసుకోవడం ద్వారా దానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని మీరు పొందగలరు.
ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజనకు కావలసిన అర్హతలు:
- ఈ పధకం లో చేరాలంటే వారు భారతదేశానికి చెందిన కుటుంబాలు అయి ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందుతారు.
- ఈ పధకం లో చేరే లబ్దిదారులు సూర్యోదయ యోజనకు పధకం అర్హులు గా మధ్య మరియు పేద కుటుంబాలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
- దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు అంత కన్నా ఎక్కువ ఉంటె ఈ పధకం లో చేరడానికి వారు అనర్హులు గా ప్రకటిస్తారు.
- సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవాలనుకునే పైకప్పుపై దరఖాస్తుదారు పేరు పై ఉండాలి. అంటే స్వగృహం అతని/ఆమె పేరు మీద కాని ఇల్లు ఉండాలి.
- దరఖాస్తుదారు గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క ఏ పథకం కింద ప్రయోజనాలను పొంది ఉండకూడదు.
- దరఖాస్తుదారు తన బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయడం తప్పనిసరిగా చెయ్యాలి.
PMSY – అవసరమైన పత్రాలు :
- దరఖాస్తుదారు కుటుంబ పెద్ద యొక్క ఆధార్ కార్డు
- రేషన్ కార్డు కాపీ
- బ్యాంకు ఖాతా వివరాలు
- మొబైల్ నంబర్ మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- ఇంటి పత్రాలు
- వార్షిక ఆదాయ రుజువు
గమనిక: అతి త్వరలో, అర్హత మరియు పత్రాల గురించి మరింత ఖచ్చితమైన సమాచారం ప్రభుత్వం నుండి అందుబాటులోకి రానుంది. అప్పటి వరకు మీరు ఈ వివరాలను సేకరించి ఉంచుకోవాలి.
PM సూర్యోదయ్ యోజన అధికారిక వెబ్‌సైట్ :
ఇంతకుముందు కూడా, దేశంలోని ప్రజల కోసం రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. దీని పేరు రూఫ్‌టాప్ సోలార్ సబ్సిడీ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం కోసం , రూఫ్‌టాప్ సోలార్ సబ్సిడీ పోర్టల్ (నేషనల్ పోర్టల్ ఫర్ రూఫ్‌టాప్ సోలార్) కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం దీనిని ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన గా ప్రకటించింది, దీని అధికారిక వెబ్‌సైట్ (పోర్టల్) pmsuryaghar gov in.
PM సూర్యోదయ యోజన కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి – PM suryoday yojana apply online
ప్రధాన్ మంత్రి సూర్యోదయ యోజన కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి, మీరు క్రింద ఇవ్వబడిన అంశాలని చదువుతూ స్టెప్స్ లను జాగ్రత్తగా చదవాలి మరియు దానిని అనుసరించాలి.
స్టెప్ 1: ముందుగా మీరు PM సూర్య ఘర్ గవర్నమెంట్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చెయ్యాలి
స్టెప్ 2: మీరు క్లిక్ చేసిన వెంటనే, మీ స్క్రీన్‌పై హోమ్ పేజీ తెరుచుకుంటుంది.
స్టెప్ 3: ఇప్పుడు మీరు క్విక్ లింక్‌ల విభాగంలో సోలార్ రూఫ్‌టాప్ అప్లై ఆన్‌లైన్ ఎంపికపై క్లిక్ చెయ్యండి.
స్టెప్ 4: ఇప్పుడు సూర్యోదయ్ యోజన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్ మీ స్క్రీన్‌పై తెరవబడుతుంది. దీనిలో మీరు మీ రాష్ట్రం, జిల్లా, విద్యుత్ డిస్ట్రి బ్యూషన్ పేరు మరియు వినియోగదారు సంఖ్యను నమోదు చేయడం ద్వారా నమోదు చేసుకోవాలి.
స్టెప్ 5: ఇప్పుడు మీరు మీ మొబైల్ నంబర్ ద్వారా ఈ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.
స్టెప్ 6: లాగిన్ అయిన తర్వాత, అప్లికేషన్ ఫారమ్ మీ స్క్రీన్‌పై తెరవబడుతుంది. దరఖాస్తు సమర్పించిన తర్వాత, మీరు విద్యుత్ విద్యుత్ డిస్ట్రి బ్యూషన్ నుండి అనుమతి పొందుతారు.
స్టెప్ 7: ఆమోదం పొందిన తర్వాత, కంపెనీ డీలర్ నుండి రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లను ఇన్‌స్టాల్ చేయాలి.
స్టెప్ 8: దీని తర్వాత మీరు నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
స్టెప్ 9: ఇప్పుడు తనిఖీ తర్వాత, మీకు డిస్కామ్ ద్వారా కమీషనింగ్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.
స్టెప్ 10: ఇప్పుడు ఈ సర్టిఫికేట్‌తో పాటు, మీరు ఈ పోర్టల్‌లో రద్దు చేయబడిన చెక్కు మరియు ఇతర బ్యాంక్ సమాచారాన్ని అప్‌లోడ్ చెయ్యాలి.
ఈ విధంగా మీరు PM సూర్యోదయ్ యోజనను ఆన్‌లైన్‌లో చాలా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చును.
PM సూర్యఘర్ యోజన గురించి మరింత సమాచారం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నట్లు అయితే మీకు కావలసిన సమాచారం మీకు అందించబడుతుంది.
Contact Details – సంప్రదించాల్సిన వివరాలు
మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మేము మీకు రూఫ్‌టాప్ సోలార్ కోసం నేషనల్ పోర్టల్ సంప్రదింపు వివరాలను అందిస్తున్నాము. మీరు వీటిని సంప్రదించి మీకు కావలసిన సమాచారం పొందగలరు.
ఇమెయిల్:- rts-mnre@gov.in టోల్ ఫ్రీ నంబర్:- 15555
You May Like: