Grama ward volunteer app | Full Details

Grama ward volunteer app

Grama ward volunteer app: ఇందులో ఎటువంటి లబ్దిదారులయిన వారికి పెన్షన్ సంబందించిన వివరాలు నమోదు చెయ్యడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ పధకానికి YSR పెన్షన్ కానుక అని పేరు పెట్టడం జరిగింది. అర్హులైన అభ్యర్ధులు ఈ యాప్ ను ఉపయోగించి పెన్షన్ పొందవచ్చు. అంతే కాకుండా ఇంకా ఎన్నో సదుపాయాలు పొందవచ్చు. అవి సింగల్ ఉన్న మహిళలకు కూడా ఈ యాప్ ద్వార పెన్షన్ పొందవచ్చు. ఇందులోంచి పెన్షన్ పధకానికి ఆధార లింక్ కూడా చెయ్యచ్చు.ఇంకా పెన్షన్ కి సంబందించి ఎటువంటి అనుమానాలు ఉన్న ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు..

➥  Beneficiary Outreach App

Grama Ward Volunteer App:

S.NOAPP NAMEVERSIONDOWNLOAD
1GSWS Volunteer AppNEW CLICK
2YSR Arogya SriNEW CLICK
3YSR Pension kanukaNEW CLICK
4Ayushman AppNEW CLICK
5AEPDSNEW CLICK
6Ayushman Bharath (PMJAY)NEW CLICK
7RBIS AppNEW CLICK

➥ YSR పెన్షన్ కానుక

➥ సింగిల్ గ మహిళలకు పెన్షన్ కోసం

➥ YSR పెన్షన్ కానుక అదార్ లింక్ చెయ్యడానికి

➥ అవ్వా – తాతలకు ఇస్తున్న పెన్షన్ కోసం వివాలు

Grama ward volunteer app & Sachivalayam Employees Common Apps:

S.NO.APP NAMEVERSIONDOWNLOAD
1Beneficiary Outreach (BOP)NEWCLICK
2Cam ScannerNEWCLICK
3GSWS Facial AttendenceNEWCLICK
4Citizen Outreach AppNEWCLICK
5Consistanace RhythmsNEWCLICK
6Note CameNEWCLICK

YSR పెన్షన్ కానుక పొందడానికి ఉండాల్సిన అర్హతలు

1). వృద్ధుల పెన్షన్ కొరకు అంటే సీనియర్ సిటిజన్స్ : ఖచ్చితంగా 60 ఏళ్ళు నిండి ఉండాలి.గిరిజనులకు అయితే 50 ఏళ్ళు నిండి ఉండాలి.

2). వితంతు పెన్షన్ లేదా విడో పెన్షన్ : భారత రాజ్యంగ వివాహ చట్టం క్రింద 18 ఏళ్ళు నిండిన వాళ్ళు అలాగే భర్త మరణాన్ని ద్రువీకరించే పత్రం లేదా తాశీల్దార్ ఇచ్చిన డేడ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా
ఉండాలి

3). వికలాంగులు లేదా ఫిజికల్లి హాన్దికాపెడ్ పెన్షన్ : 40% లేదా అంతకన్నా ఎక్కువ అంగ వైకల్యం ఉన్న వారు దీనికి అర్హులు. అలాగే దీనికి సంబందించిన సర్టిఫికేట్ కల్గి ఉండాలి. వీరికి ఏజ్ లిమిట్ అంటూ ఎం లేదు.

4). చేనేత కార్మికుల పెన్షన్ కోసం : వీరికి 50 ఏళ్ళు నిండిన వారు, దీనితో పాటు చేనేత & జౌళి బోర్డు వారు జారి చేసిన ID సర్టిఫికేట్ ఉన్నవారు అర్హులు

5). కల్లు గీత కార్మికుల పెన్షన్ కోసం : వీరికి 50 ఏళ్ళు నిండిన వారు, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిచే జారి చేసిన ID సర్టిఫికేట్ ఉన్నవారు అర్హులు.

6). మత్స్యకారుల పెన్షన్ కోసం :వీరికి 50 ఏళ్ళు నిండిన వారు, అలాగే మత్స్యశాఖ లేదా ఫిషరీస్ డిపార్టుమెంటు వారు జారి చేసిన ID సర్టిఫికేట్ ఉన్నవారు అర్హులు.

7). H I V భాదితుల పెన్షన్ కోసం : దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు అయితే గత 6 నెలలు గా A.R.T. ట్రీట్మెంట్ తీసుకున్నవారు దీనికి అర్హులు.

8). డయాలసిస్ (C K D U ) పెన్షన్ కోసం :ఏజ్ తో సంబందం లేకుండా ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అలాగే Y S R ఆరోగ్యశ్రీ పధకం క్రింద ప్రైవేట్ హాస్పిటల్స్ లో డయాలసిస్ తీసుకునేవారు అర్హులు. దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు ( స్టేజ్ 3,4,& 5 ).

9). ట్రాన్స్ జెండర్ పెన్షన్ కోసం : దీనికి 18 ఏళ్ళు నిండిన వారై ఉండాలి . అంతేకాకుండా గవెర్నమెంట్ హెల్త్ & మెడికల్ డిపార్టుమెంటు వారు జారీ చేసిన I D సర్టిఫికేట్ ఉండాలి

10). సింగిల్ లేడి లేదా ఒంటరి మహిళా పెన్షన్ కోసం : 35 ఏళ్ళు ఉండి చట్టప్రకారం భర్త నుండి డైవర్స్ తీసుకున్న వారు, లేదా ఏ కారణం చేతనైన భర్త నుండి దూరంగా ఉన్నవారు, అలాగే వీరు భర్త నుండి ఒక సంవత్సరం అయిన దూరం గా ఉండాలి.

అలాగే విలేజ్ లో గాని సిటీ లో గాని ఉన్న వారు, భర్త నుండి విడిపోయినట్లు ఏ విధమైన సర్టిఫికేట్ లేకపోయిన వారు ఖచ్చితం గా విలేజ్ లేదా వార్డు స్దాయిలో గవర్నమెంట్ ఆఫీసర్ సాక్ష్యం తో తాసిల్దార్ వారి చే జారి చేసిన సర్టిఫికేట్ ఉండాలి. అంతే కాకుండా పెళ్లి కాకుండా ఎటువంటి ఆదరణ లేనివారు ఒంటరి గా ఉన్నవారు, విలేజ్ లో ఉన్న వారికి 30 ఏళ్ళు సిటీ లో ఉన్న వాళ్లకి 35 ఏళ్ళు నిండి ఉండాలి.

వీరు పెన్షన్ పొందిన తర్వాత పెళ్లి చేసుకున్న లేదా ఆర్ధికం గా వెసులుబాటు కల్గిన వెంటనే పెన్షన్ కాన్సిల్ చేసే అధికారం సంబందిత శాఖా అధికారికి అధికారం ఉంది. దీనికోసం ప్రతి నెల పెన్షన్ మంజూరు చేసే అధికారి ఆమె స్దితిగతులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి.

11). డప్పు కళాకారుల పెన్షన్ కోసం : వీరికి 50 ఏళ్ళు నిండిన వారై ఉండాలి. సాంఘిక & సంక్షేమ శాఖ వారు జారి చేసిన I D సర్టిఫికేట్ ఉన్నవారు అర్హులు.

12). చర్మకారుల పెన్షన్ కోసం : వీరికి 40 ఏళ్ళు నిండిన వారై ఉండాలి. అలాగే లబ్దిదారుల జాబితా సాంఘిక & సంక్షేమ శాఖ వారు జారి చేసిన గుర్తింపు కార్డు ఉండాలి.

13). అభయ హస్తం పెన్షన్ కోసం : స్వయం సాహాయక గ్రూప్ సబ్యులు ఎవరైతే అభయ హస్తం పధకం లో వారు కాంట్రి బ్యూషన్ చెల్లిస్తూ ఉన్నారో అలాంటి వారి తో పాటు 60 ఏళ్ళు నిండిన వారు ఈ పధకానికి అర్హుల క్రింద వస్తారు.

➥  Grama ward Volunteer App New version Download Now

దీనికోసం మరింత సమాచారం కోసం డౌన్లోడ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ని క్లిక్ చేసి మీరు కొత్త Grama ward volunteer app తో కొత్త యాప్ తో వివరాలతో మరింత సమాచారం తెలుసుకోవచ్చు. ఈ లింక్ ద్వార ఆరొగ్యశ్రీ సేవలు కూడా పొందవచ్చు.

ayushman App & ఆయుష్మాన్ యాప్ వివరాలు :

ఇందులో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయిన్చుకున్నారో వారి వివారాలు అన్ని ఇందులో ఉంచుతారు. ఈ వ్యక్తి భారత దేశం లో ఎక్కడ ఉన్న వారి రిజిస్ట్రేషన్ వివరాలు ఆధారం గా అప్పటికప్పుడు వారికి సరియైన ట్రీట్మెంట్ అందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.

హెల్త్ I D – Health ID :

ఇందులో లబ్దిదారుల వివరాలు అంటే వారి పేరు వారు ఉంటున్న చిరునామా వివరాలు అలాగే సిస్టం డెమోగ్రాఫిక్, లొకేషన్ వివరాలు, వారి కుటుంబం లేదా కుటుంబ సబ్యుల వివరాలు అన్ని నమోదు చెయ్యబడతాయి. వ్యక్తి యొక్క పూర్తి సమాచారం కోసం అన్ని వివరాలు ఇందులో ఉంటాయి. దీనికి సబందించి అన్ని వివారాలను సేకరించడం కుడా చేస్తారు. వారి హెల్త్ రికార్డుల వివరాలను వారి సమ్మతి తోనే హెల్త్ కేర్ సిస్టం లు అలాగే వివిధ వాటాదారులతో అవసరమైన సమాచారం పంచుకుంటుంది. ఇది అంత ఆ వ్యక్తి పూర్తి సమ్మతి ప్రకారం జరుగుతుంది.

హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రేషన్ – Health Care Professionals Registration :

ఇందులో ఆయుష్మాన్ డిజిటల్ మిషన్ ప్రకారం ఇందులో ఆధునిక వ్యవస్దలలో పాటు సాంప్రదాయ వ్యవస్దల లో ఉన్న అందరు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వారి సమగ్ర రిపోజిటరి ఉంటుంది. ఇందులో నమోదు చేసుకోవడం ద్వారా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరు డిజిటల్ హెల్త్ ఈకో సిస్టం కు కనక్ట్ అవ్వడం జరుగుతుంది.

వ్యక్తి గత హెల్త్ రికార్డులు – Personal Health Records :

ఒక వ్యక్తి యొక్క రికార్డులను అన్ని ఎలెక్ట్రానిక్ సిస్టం కు మార్చి అతని యొక్క వివరాలు దీని ద్వార నిర్వహించడం జరుగుతుంది అలాగే అవసరమైన చోట ఇన్ఫర్మేషన్ పంచుకోవడం కాని నియత్రించడం కాని జరుగుతుంది.

PHR అంటే వ్యక్తి గత హెల్త్ రికార్డు వ్యవస్ద. అతని లేదా ఆమె ఆరోగ్య సంరక్షణ కు సంబందించి పూర్తి సామాచారాన్ని నిర్వహించడం వీలు కల్గుతుంది. ఇంకా ఇందులో అతని/ఆమె హెల్త్ డేటా తో పాటు, లాబ్ రిపోర్ట్స్, డిశ్చార్జ్ సమ్మరీ కి సంబందించిన వివరాలు, అంతే కాకకుండా వారికి జరిగిన ఎటువంటి ట్రీట్మెంట్ జరిగిన వాటి వివరాలు అన్ని ఇందులో ఉంచుతారు.

RBIS App:

➥ RBIS App DOWNLOAD NOW

ఈ RBIS యాప్ లో రిజిస్టర్ చెయ్యబడిన పెన్షన్ లబ్దిదారుల్లో ఒక్క లెప్రసీ పెంషనర్లు తప్ప మిగతా పెంషనర్లు ఫస్ట్ బయోమెట్రిక్ ద్వార 3 టైమ్స్ ఫింగర్ ప్రింట్ అయిన తర్వాత మాత్రమే మీరు ఈ RBIS యాప్ లో లాగిన్ అయ్యి, పేమెంట్ స్క్రీన్ లో రిఫ్రెష్ బటన్ క్లిక్ చేసిన తర్వాతనే ఈ RBIS యాప్ ద్వార పెన్షన్ ఇవ్వడం జరుగితుంది లేదా పెన్షన్ ఇస్తారు

volunteer app : Grama ward volunteer app

volunteer app లో లబ్దిదారులకు సంబందించిన ఎటువంటి సమాచారం కావాల్సిన దీనికి సంబందించిన లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి కావాల్సిన యాప్ లు ఓపెన్ అవుతాయి. మనకి కావాల్సిన పధకాలు కాని అందులో మనకి సంబందించిన యాప్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవడం లేదా మనం ఆ పధకానికి అర్హులమా కాదా కూడా తెలుసుకోవచ్చు. ఈ యాప్ వల్ల తాజా సమాచారాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా నుండి నైన సులభంగా తెలుసుకోవచ్చు . దీనికి సంబందించిన లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.

➥ Volunteer app Download

➥ Volunteer app Download

Leave a Comment