Navagraha stotram in telugu pdf

Navagraha stotram in telugu pdf download it by given below link.

Navagraha stotram in telugu pdf

Navagraha stotram in telugu pdf

➥ Navagraha stotram in telugu pdf

Navagraha stotram in telugu

జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్ |
తమోఽరిం సర్వపాపఘ్నం ప్రణతోఽస్మి దివాకరమ్ || ౧ ||

దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవమ్ |
నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణమ్ || ౨ ||

ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభమ్ |
కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహమ్ || ౩ ||

ప్రియంగుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్ |
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ || ౪ ||

దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసంనిభమ్ |
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ || ౫ ||

హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ |
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ || ౬ ||

నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయామార్తండసంభూతం తం నమామి శనైశ్చరమ్ || ౭ ||

అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్యవిమర్దనమ్ |
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ || ౮ ||

పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ || ౯ ||

ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్సుసమాహితః |
దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతిర్భవిష్యతి || ౧౦ ||

నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనమ్ |
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనమ్ || ౧౧ ||

గృహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్భవాః |
తాః సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః || ౧౨ ||

ఈ నవగ్రహ శ్లోకం చదవండి గ్రహ దోషాల నుండి బయటపడంది

భారత దేశం లో ఉన్న హిందువులు అందరు జాతకాలను విపరీతం గా నమ్ముతారు. అంతే కాదు ఎవరికీ అయన గ్రహ దోషాలు ఉన్నట్లయితే ఆ గ్రహానికి శాంతి చేయించడం చేస్తూ ఉంటారు. అలాగే కొందరికి ఈ గ్రహాల దోషాలు రాకుండా నిరంతరం నవ గ్రహ శ్లోకాలు చదువుకుంటారు. అలా చదవడం వలన వారికి ఉపశమనం కూడా లభిస్తుంది. కొందరు రోజు దేవాలయాలు కు వెళ్ళి అందరి దేవుళ్ళ తో పాటు నవగ్రహాలకు కుడా ప్రదక్షణలు చేస్తూ ఉంటారు. మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి అంతో ఇంతో గ్రహ దోషాలు ఉండడం సర్వసాధారణం. దీని వల్ల భయపడాల్సిన పని లేదు. ఎవరైనా సరే వారి శక్తీ కొలది పూజలు చేయించుకుంటే చాలు లేదా ఈ శ్లోకాలు చదువుకున్న చాలు గ్రహాల ప్రభావం తగ్గుతుంది. నవ గ్రహాలను అనేవి చాలా శక్తివంతమైన మరియు వెంటనే ఎలాంటి ప్రభావమైన చూప గలిగే శక్తులుగా భావిస్తారు. ఈ తొమ్మిది గ్రహాలలో ప్రతి ఒక్క గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది.

ఈ నవ గ్రహాలు మన జీవితంలోని కొన్నిఅంశాలతో ముడి పడి ఉండడం సహజం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ,మనుషుల జాతకంలో ఉండే గ్రహాల స్థానం, అలాగే ఇతర గ్రహాలతో వాటి కలయికను బట్టి మనుషుల మీద వాటి ప్రభావం ఎలా ఉంటుందో చెప్తారు జ్యోతిష్య నిపుణులు. ఈ నవ గ్రహాల ప్రభావం వలనే వ్యక్తులు వారి జీవితంలో ఎదురైన శుభ ఫలితాలను లేదా అశుభ ఫలితాలను పొందడం జరుగుతుంది. అలాగే మనం నిత్యం చేసుకునే దేవుడి పూజ అనంతరం ప్రతిరోజూ ఈ నవగ్రహ స్తోత్రాన్ని మనసు లగ్నం చేసుకుని భక్తి తో చదివితే ఎలాంటి గ్రహ దోషాలు దరి చేరవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.
అత్యంత విశ్వాసంతో మరియు అంకితభావంతో జపించండి.

అంతే కాదు మనం నిత్యం ఈ తొమ్మిది గ్రహాలను ఆరాధించడం వల్ల కచ్చితంగా అన్ని గ్రహాల అనుగ్రహం లభిస్తుంది. అంతే కాదు మీరు చేసే ప్రతి పనిలో కచ్చితంగా విజయం లభిస్తుంది అని చెప్తున్నారు శాస్త్ర పండితులు. ఈ నవగ్రహాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకుందాం !

1.సూర్యుడిని – అనారోగ్య సమస్యలు దూరమవుతాయి

2.చంద్రుడిని – మనోధైర్యం పెరుగుతుంది

3.బుధ గ్రహాన్ని – చక్కటి విద్య వస్తుంది

4.కుజ గ్రహం – శరీరంలో మలినం, విష పదార్థాలు తొలగిస్తుంది

5.గురుగ్రహం – శుభాలే వింటారు

6.శుక్రుడిని – సుఖసంతోషాలతో ఉంటారు

7.శనిే – దీర్ఘాయువు కలిగి ఆరోగ్యంగా ఉంటారు

8.రాహుగ్రహం – తక్షణమే అనారోగ్యం తొలగిపోతుంది

9.కేతుగ్రహం – సేవిస్తే సంపదలు, సౌఖ్యాలు లభిస్తాయి

Leave a Comment