Runa vimochana narasimha stotram in telugu PDF

Runa vimochana narasimha stotram in telugu PDF download it by given below link.

Runa vimochana narasimha stotram in telugu PDF

Runa vimochana narasimha stotram in telugu PDF

➥ Runa vimochana narasimha stotram in telugu PDF

Runa vimochana narasimha stotram in telugu

దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ||

య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ ||

అప్పుల బాధ భరించలేకపోతున్నారా! లక్ష్మీ నరసింహ స్వామి మంత్రం చదవండి !

మనిషి అన్నాక కష్టాలు సుఖాలు వస్తు ఉంటాయి పోతూ ఉంటాయి. కష్టం వచ్చినపుడు క్రుంగి పోయి సుఖం వచ్చినపుడు మన అంత వాళ్ళు లేరని అనుకోకూడదు. మనిషి ఎదో ఒక అవసరం కోసం ఎన్నో అప్పులు చేస్తాడు. ఆ అప్పులు తీర్చడానికి ఎన్ని కష్టాలు పడాలో అన్ని పడతాడు. ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి. మనం ఎంత కష్ట పడిన అంతో ఇంతో దేవుని ఆశీస్సులు కావాలి. మనం కష్ట పడడానికి తోడు ఆ దేవుడు ఆశీస్సులు ఉంటె మనం అప్పుల భాద నుండి బయట పడిపోవచ్చు.

దీనికి ఒక చిన్న చిట్కా ఉంది ఎలాంటి రుణ బాధలు ఉన్న అవి తొలగి పోవడానికి నృసింహ స్తోత్రం పఠించడం మంచిదని వేద శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఈ మంత్రాన్ని రోజూ పఠించే వారికి రుణబాధలు అనేవి తొందరగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఈ నృసింహ రుణ విమోచన స్తోత్రం చదివితే పూర్వ జన్మ పాపాలు కుడా పోతాయని పురాణాలలో ఉందని పండితులు చెప్తున్నారు. అలాగే మనకి తెలిసీ తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. అలాంటి పాపాల నుంచి గట్టెక్కాలంటే మనం చేయాల్సిందల్లా శ్రీ నృసింహ స్వామిని భక్తి తో పూజించాలి. చేసిన పాపాలు తొలగిపోవాలంటే భక్తిని మించిన పరిహారం లేదు అని గ్రంధాలలో చెప్పడం జరిగింది.

మనం పూర్తి విశ్వాసంతో ఆ నరసింహ స్వామిని శరణు కోరితే తప్పకుండా ఎలాంటి పాపాలు తొలగిపోయి ఈతిబాధల నుంచి తప్పించుకుని మనశ్శాంతి ఏర్పడుతుంది. మన ఇంటిలో తూర్పు దిశలో పూజగదిలో నరసింహ స్వామి పటాన్ని వుంచి ర్జోజు ఈ నృసింహ రుణ విమోచన స్తోత్రం చదివాలి, పూజించాలి. అలాగే రోజూ శుచిగా స్నానం చేసి శుభ్రమైన మంచి బట్టలు కట్టుకుని ఈ నరసింహ ప్రభక్తి శ్లోకాన్ని 3, 12, 24, 48 సార్లు పారాయణం చేయడం ద్వారా కుటుంబం లో ఉన్న ఎటువంటి భాదలు అయిన తొందర గా తొలగి పోయి మన మనస్సు లో అనుకున్నది తప్పకుండా జరుగుతుంది.

ఈ శ్లోకాన్ని పఠించేటప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి పటం ముందు తప్పకుండా దీపం వెలిగించి, పూజ పూర్తి అయ్యాక మరిగించి చల్లార్చిన ఆవు పాలను లేదా పానకాన్ని నైవేద్యం గా సమర్పించాలి. నైవేద్యం పెట్టిన ఈ ప్రసాదాన్ని కుటుంబ సబ్యులు అందరూ తప్పని సరిగా తీసుకోవాలి. ఇలా 48 రోజుల పాటు దీక్ష తో నరసింహ స్వామిని ఆరాధించిన కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నారదడు పురాణాలలో చెప్పినట్లు వేద పండితులు సూచిస్తున్నారు.

You may also Like:

Ayyappa ashtothram in telugu pdf

Subramanya karavalamba stotram in telugu pdf

Mangala gowri ashtothram

Leave a Comment