Subramanya karavalamba stotram in telugu pdf

Subramanya karavalamba stotram in telugu pdf download it by given below link.

Subramanya karavalamba stotram in telugu pdf

Subramanya karavalamba stotram in telugu pdf

➥ Subramanya karavalamba stotram

Subramanya karavalamba stotram in telugu

హే స్వామినాథ కరుణాకర దీనబంధో – శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౧ ||

దేవాదిదేవనుత దేవగణాధినాథ – దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౨ ||

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ – తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౩ ||

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల – పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౪ ||

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య – దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౫ ||

హారాదిరత్నమణియుక్తకిరీటహార – కేయూరకుండలలసత్కవచాభిరామ |
హే వీర తారక జయాఽమరబృందవంద్య – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౬ ||

పంచాక్షరాదిమనుమన్త్రిత గాఙ్గతోయైః – పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౭ ||

శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా – కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |
భక్త్వా తు మామవకళాధర కాంతికాన్త్యా – వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || ౮ ||

సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి || ౯ ||

సంతానాన్ని ప్రసాదించే సుబ్రహ్మణ్య అష్టకం – కరావలంబ స్తోత్రం!

ఆ పరమేశ్వరుడు కుమారుడు అయిన కుమారా స్వామి అనగా సుబ్రహమణ్య స్వామి మనం నిత్యం ఆరాదించే స్తోత్రాలలో సుబ్రహ్మణ్య అష్టకం లేదా సుబ్రహమణ్య కవావలంబం స్తోత్రం చాల చాలా ప్రాముఖ్యమైనది అని చెప్తారు పండితులు. ఆ కుమారస్వామి కటాక్షం కోసం ప్రతీ రోజు చాలా మంది చదువుతారు. ఇది చాలా పవర్ఫుల్ అనే చెప్పాలి.

ఆ సుబ్రహ్మణ్య విశిష్టత తో పాటు ఆయన ఔనత్యాన్ని తెలుపుతుంది ఈ స్తోత్రం. ఈ స్తోత్రం ను చదివిన వారికి తప్పక ఆయన కరుణా కటాక్షాలు లభిస్తాయి. ఈ సుబ్రహమణ్య కరావలంబం చదివిన వారికి అన్ని రకాల మేలు జరుగుతుంది. ముఖ్యం గా కొత్త గా పెళ్లి అయిన వారు అలాగే పెళ్లి అయ్యి చాలా కాలం నుండి పిల్లలు లేని వారు ఇది చదివితే తప్పకుండా వారికి పిల్లలు కలుగుతారని ఎన్నో పురాణాలలో చెప్పడం జరిగింది.

అంతే కాదు దీని వల్ల పాప నాశనం కూడా జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇది చదవడం వల్ల. ఈ సుబ్రహ్మణ్య అష్టకం ఎవరైతే పఠిస్తారో వారికి సుబ్రహ్మణ్య స్వామి ముక్తిని, మోక్షమును ప్రసాదిస్తాడు.

Leave a Comment