Ayyappa ashtothram in telugu pdf

Ayyappa ashtothram in telugu pdf download it by given below link.

Ayyappa ashtothram in telugu pdf

Ayyappa ashtothram in telugu pdf

➥ Ayyappa ashtothram in telugu

Ayyappa ashtothram in telugu

మహాశాస్తా మహాదేవో మహాదేవసుతోఽవ్యయః ।
లోకకర్తా లోకభర్తా లోకహర్తా పరాత్పరః ॥ 1 ॥

త్రిలోకరక్షకో ధన్వీ తపస్వీ భూతసైనికః ।
మంత్రవేదీ మహావేదీ మారుతో జగదీశ్వరః ॥ 2 ॥

లోకాధ్యక్షోఽగ్రణీః శ్రీమానప్రమేయపరాక్రమః ।
సింహారూఢో గజారూఢో హయారూఢో మహేశ్వరః ॥ 3 ॥

నానాశస్త్రధరోఽనర్ఘో నానావిద్యావిశారదః ।
నానారూపధరో వీరో నానాప్రాణినిషేవితః ॥ 4 ॥

భూతేశో భూతితో భృత్యో భుజంగాభరణోజ్వలః ।
ఇక్షుధన్వీ పుష్పబాణో మహారూపో మహాప్రభుః ॥ 5 ॥

మాయాదేవీసుతో మాన్యో మహనీయో మహాగుణః ।
మహాశైవో మహారుద్రో వైష్ణవో విష్ణుపూజకః ॥ 6 ॥

విఘ్నేశో వీరభద్రేశో భైరవో షణ్ముఖప్రియః ।
మేరుశృంగసమాసీనో మునిసంఘనిషేవితః ॥ 7 ॥

దేవో భద్రో జగన్నాథో గణనాథో గణేశ్వరః ।
మహాయోగీ మహామాయీ మహాజ్ఞానీ మహాస్థిరః ॥ 8 ॥

దేవశాస్తా భూతశాస్తా భీమహాసపరాక్రమః ।
నాగహారో నాగకేశో వ్యోమకేశః సనాతనః ॥ 9 ॥

సగుణో నిర్గుణో నిత్యో నిత్యతృప్తో నిరాశ్రయః ।
లోకాశ్రయో గణాధీశశ్చతుష్షష్టికలామయః ॥ 10 ॥

ఋగ్యజుఃసామథర్వాత్మా మల్లకాసురభంజనః ।
త్రిమూర్తి దైత్యమథనః ప్రకృతిః పురుషోత్తమః ॥ 11 ॥

కాలజ్ఞానీ మహాజ్ఞానీ కామదః కమలేక్షణః ।
కల్పవృక్షో మహావృక్షో విద్యావృక్షో విభూతిదః ॥ 12 ॥

సంసారతాపవిచ్ఛేత్తా పశులోకభయంకరః ।
రోగహంతా ప్రాణదాతా పరగర్వవిభంజనః ॥ 13 ॥

సర్వశాస్త్రార్థతత్వజ్ఞో నీతిమాన్ పాపభంజనః ।
పుష్కలాపూర్ణాసంయుక్తః పరమాత్మా సతాంగతిః ॥ 14 ॥

అనంతాదిత్యసంకాశః సుబ్రహ్మణ్యానుజో బలీ ।
భక్తానుకంపీ దేవేశో భగవాన్ భక్తవత్సలః ॥ 15 ॥

అయ్యప్ప స్తోత్ర మహిమలు తెలుసుకోండి !

మన హిందువుల దేవుళ్ళ లో ఒక్కక్కరిది ఒక్కక్క స్దానం. మన ఆచార సంప్రదాయాల ప్రకారం భక్తి తో నిత్యం పూజాదికారాలు నిర్వహిస్తూ ఉంటాం. అలాగే ప్రతీ హిందువుకి ఒక్కక్క దేవుడిని ప్రత్యేకంగా కొలుస్తారు. అలాగే ఆ దేవుడికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. అలా ప్రత్యేక నియమ నిభంధనలు ఉన్న స్వామి అంటూ ఒకరు ఉన్నారు ఆయనే అయ్యప్ప.

ఈయన జననం కూడా చాల విచిత్రం గా ఉంటుంది. కాని కోరిన వారికీ కోరినట్లు వరాలు ప్రసాదించే ఈ అయ్యప్ప మహత్యం గురించి చెప్పాలంటే ఎన్నో ఎన్నోనో. అయ్యప్ప స్వామి దీక్షలో వ్యవధికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ అయ్యప్ప ని కొలవాలంటే దానికి ఒక నిబందన ఉంది అది మణిమాలను ధరించి దీక్షను ప్రారంభించాలి. నియమాలతో దీక్ష చేసి, ఇరుమడి కట్టుకుని అప్పటి దాకా ఒక పవిత్రమైన జీవనాన్ని, కఠిన నియమాలతో పాటిస్తారు ఆయన భక్తులు.

అసలు 40 రోజుల పాటు దీక్షను ఎందుకు నిర్దేశించారు? అని చూస్తే దీని వెనుకున్న శాస్త్రీయతను తెలుసుకుంటే ఎన్నో విషయాలు మనకి అర్ధం అవుతాయి. అయ్యప్ప స్వామి దీక్షకు 40 రోజులు పాటు దీక్ష చేయాలనే నియమం ఉంది అందుకు ప్రత్యేక కారణం ఉంది. సంవత్సరానికి 360 రోజులు ఉంటె దాన్ని 9 చే భాగిన్చినట్లయితే 40 రోజులు వస్తాయి.

దీన్ని మండల కాలంగా విభజిస్తారు. ఈ మండల కాలం పాటు ఏదైనా దీక్ష చేసినట్లయితే అది మిగిలిన జీవితానికి ఆదర్శం గా నిలుస్తుంది. అలాగే మనిషికి ఉండే కొన్ని చెడు అలవాట్లు అంటే పొగతాగటం, మద్యం సేవించడం లాంటి దురలవాలట్లు ఈ 40 రోజుల పాటు దూరంగా ఉంటే మిగిలిన సమయంలోనూ నిగ్రహంతో ఉండదానికి మనకు మంచి అవకాశంగా భావించాలి. అలాగే ప్రతీ మనిషి కి ఎలాంటి ఆర్భాటాలు, హంగులు లేకుండా సామాన్య జీవనం గడిపే ఒక మంచి అలవాటు వస్తుంది.

Leave a Comment