Annapurne sadapurne mantra in telugu pdf

Annapurne sadapurne mantra in telugu pdf download it by given below link.

Annapurne sadapurne mantra
Annapurne sadapurne mantra

Annapurne sadapurne mantra in Telugu Pdf :

➥ Annapurne sadapurne mantra in Telugu PDF

Annapurne sadapurne mantra – అన్నపూర్ణే – సదాపూర్ణే

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలదోషపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ |
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౧ ||

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలసద్వక్షోజకుంభాంతరీ |
కాశ్మీరాగరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౨ ||

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ |
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౩ ||

కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ |
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౪ ||

దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ |
శ్రీవిశ్వేశమనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౫ ||

ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ |
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౬ ||

ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ |
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౭ ||

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౮ ||

చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ |
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౯ ||

క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || ౧౦ ||

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే |
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || ౧౧ ||

మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః |
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || ౧౨ ||

అన్నపూర్ణే – సదాపూర్ణే – మీకు తెలుసా అన్నదానం మహత్యం

మన దేశం లో ప్రతీ హిందువు అన్నాన్ని చాల పవిత్రం గా చూస్తారు. అందుకే అంటారు మన పెద్దలు ” అన్నం పరబ్రహ్మ స్వరూపం ” అని . అన్నం లేకపోతే ఏ ప్రాణి జీవించడం జరగదు. కొంత మంది కి ఎంతో కష్ట పడితే కాని అన్నం ముట్టదు అంటే అన్నం దొరకదు.

అలాగే కొంత మంది వారు చేసుకున్న గత పూర్వజన్మ పుణ్య ఫలం వల్ల అన్నానికి లోటు ఉండదు . ఇదంతా ఆ సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం ఉంటె కాని దొరకదు. ఆ అమ్మ దయ ఉంటె అన్ని ఉన్నట్లే అని చెప్తారు మన పండితులు. మనం రోజు ప్రతి నిత్యం భోజనం చేస్తున్నప్పుడు ఆ అమ్మను మనసు లో ధ్యానించి ఆమె బిక్ష అనుకుని భుజించాలి.

అలాగే మనం చేసే అన్న దానం కోటి గోవుల దాన ఫలితం ఉంటుందని పురాణాలలో చెప్పడం జరిగింది. మన నిత్య జీవితం లో ఎం లేకపోయినా బ్రతకగలం కాని ఆహారం లేకపోతే మాత్రం బతకలేము.

ఇక మనిషి స్వభావం గురుంచి చూస్తే మనిషి అనే వాడికి ఆశకు అంతు ఉండదు ఎంత ఇచ్చిన ఇంకా కావాలి అనే అడుగుతాడు. కాని అన్నం దగ్గరకి వచ్చే సరికి కడుపు నిండితే ఇక చాలు అంటాడు.ఇదే అన్నదానం ప్రత్యేకత. మనిషిని ఏ దానం తోనైనా సరే సంతృప్తి పరచడం కష్టం, కాని అన్నంతో చాలు అని సంతృప్తి తో భోజనం దగ్గరనుండి లేస్తాడు. మనం దానం చెయ్యకపోయినా అన్నం పెట్టె ఇల్లు ని చూపించాలని పండితులు చెబుతారు.

Leave a Comment