Hanuman dandakam in telugu pdf

Hanuman dandakam in telugu pdf download it by given below link.

Hanuman dandakam in telugu pdf

Hanuman dandakam in telugu pdf

➥ Hanuman dandakam in telugu PDF

➥ Bajrang baan in telugu PDF

Hanuman dandakam-ఆంజనేయ దండకం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్​జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్​మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్​వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్​దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్​జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్​ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్​చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః

శ్రీ ఆంజనేయ దండకం – ఏ కోరికైన తీరాల్సిందే !

శ్రీ ఆంజనేయ దండకం ఇది ప్రతీ హిందువు చదివే అద్భుతమైన మంత్రం. ఇది మన తెలుగు వారు అందరు నిత్యం పూజ సమయం లో దీనిని కూడా చదువు తారు. ఇది ఎప్పటినుండో ప్రాచుర్యం లో ఉన్న మహమాన్విత దండకం. ఈ దండకం లో హనుమాన్ యొక్క మహిమలు, ఆయన గుణగణాలు,ఆయన సాధించిన ఘనకార్యాలు, ఆయన ఇచ్చే రక్షణ, అనుగ్రం ఇవన్ని వివరిస్తూ ఈ దండక స్తోత్రం ని తయారు చేసారు. ఇందులో వాడిన పదాలు అంటే సంస్కృతం లో వాడిన పదాలకు అద్భతమైన శబ్ద శక్తీ తో పాటు అద్భుతమైన మంత్ర శక్తీ కూడా ఉన్నాయి ఈ పదాలకు. ఈ దండకం చదవడం కానీ వినడం కాని చేస్తున్నప్పుడు మనకే తేలుస్తుంది

అందులో భావన, అర్ధం ఎంత పవర్ ఫుల్ గా అనిపిస్తాయి చదువుతుంటే. అందువల్ల దీనిని శ్రద్ధ గా మనసు లగ్నం చేసి కనక చదివితే కోరిన కోర్కెలు తీరతాయని పండితులు చెప్తున్నారు. మన భారతదేశంలోని ఏ ప్రాంతం వారికి అయినా గోప్ప ఆధ్యాత్మిక, గొప్ప దైవభక్తిక విషయ పరిజ్ఞానం ఇలాంటివి కలగాలి అన్న, సాధించడం లో పురోగతి కావాలన్నా మనకు మహర్షుల బోధనలే అధారం ! మహర్షులు అందరూ సంస్కృతభాషలోనే రచించడం అలాగే భోదించడం చేశారు. మనం అందరం మన మాతృభాషలో చదివిన విషయాలు , విన్న విషయాలు అలాగే భావాలు అర్థమౌతాయని అందరికీ తెలిసినదే. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ దండకమును కంఠస్థం చేసినట్లయితే , వారు చదువుకునేటట్లు , ఇక వారికి దైవ సంబంధమైన రక్షణ సంపూర్ణంగా లభించినట్లే. నిశ్చింతగా ఉండవచ్చును !

Leave a Comment