lakshmi ashtothram in telugu pdf: శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం

lakshmi ashtothram in telugu pdf download it by given below link. 

lakshmi ashtothram in telugu pdf
lakshmi ashtothram in telugu pdf

lakshmi ashtothram in telugu pdf

➥ lakshmi ashtothram in telugu pdf

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం

దేవ్యువాచ

దేవదేవ! మహాదేవ! త్రికాలజ్ఞ! మహేశ్వర!

కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ॥

అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥

ఈశ్వర ఉవాచ

దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్ ।

సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ॥

సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ ।

రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరమ్ ॥

దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ ।

పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ ॥

సమస్త దేవ సంసేవ్యం అణిమాద్యష్ట సిద్ధిదమ్ ।

కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్ ॥

తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు ।

అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా ॥

క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ ।

అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః ॥

ధ్యానం

వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం

హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ ।

భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం

పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ॥

సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే ।
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ॥

ఓం
ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత-హితప్రదామ్ ।
శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికామ్ ॥ 1 ॥

వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధామ్ ।
ధన్యాం హిరణ్యయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీమ్ ॥ 2 ॥

అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీమ్ ।
నమామి కమలాం కాంతాం కామ్యాం క్షీరోదసంభవామ్ ॥ 3 ॥

అనుగ్రహప్రదాం బుద్ధి-మనఘాం హరివల్లభామ్ ।
అశోకా-మమృతాం దీప్తాం లోకశోకవినాశినీమ్ ॥ 4 ॥

నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరమ్ ।
పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీమ్ ॥ 5 ॥

పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమామ్ ।
పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీమ్ ॥ 6 ॥

పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభామ్ ।
నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీమ్ ॥ 7 ॥

చతుర్భుజాం చంద్రరూపా-మిందిరా-మిందుశీతలామ్ ।
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్ ॥ 8 ॥

విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీమ్ ।
ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియమ్ ॥ 9 ॥

భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీమ్ ।
వసుంధరా ముదారాంగాం హరిణీం హేమమాలినీమ్ ॥ 10 ॥

ధనధాన్యకరీం సిద్ధిం సదాసౌమ్యాం శుభప్రదామ్ ।
నృపవేశ్మగతాం నందాం వరలక్ష్మీం వసుప్రదామ్ ॥ 11 ॥

శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయామ్ ।
నమామి మంగళాం దేవీం విష్ణువక్షఃస్థలస్థితామ్ ॥ 12 ॥

విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం నారాయణసమాశ్రితామ్ ।
దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీమ్ ॥ 13 ॥

నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణుశివాత్మికామ్ ।
త్రికాలజ్ఞానసంపన్నాం నమామి భువనేశ్వరీమ్ ॥ 14 ॥

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ ।
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ॥
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ ।
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ॥ 15 ॥

మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే ॥ 16 ॥

త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః ।
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః ।
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ ।
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః ॥ 17 ॥

భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ ।
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ॥
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ ।
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః ॥ 18 ॥

భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ ।
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే ।
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ ॥ 19 ॥

ఇతి శ్రీ లక్ష్మ్యష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణం

lakshmi ashtothram in telugu pdf : HOW TO READ

ఈ మంత్రాలతో పూజచేస్తే లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది!

మన భారత దేశం లో హిందువులకు దైవభక్తి మెండు గానే ఉంటుంది. ఏ పండగ వచ్చిన మన గృహం లో అందరి దేవుళ్ళను పూజించిన తర్వాత కాని మనం ఎటువంటి ఆహారం తీసుకోము. సంవత్సరం పొడవునా మన హిందువులకు ఎదో ఒక పండగ వస్తు ఉంటుంది.

అలాగే మన ఇంటిలో నిత్యం చదువుకునే కొన్ని గ్రంధాలు కాని శ్లోకాలు కాని ఏవో ఒకటి మనం చదువుతూ ఉంటాం. ఎం చదివిన మనం ఆ దేవుళ్ళని సంతృప్తి పరచడమే మనకి ముఖ్యం. ఎదో ఒక కోరిక కోసం ప్రతి ఒక్కరు రక రకాల దేవుళ్ళ స్తోత్రాలను చదువుతూ ఉంటారు. అందులో చాల ముఖ్యమైంది శ్రీ లక్ష్మి అష్టోత్తరం. ప్రతి ఒక్కరు ఈ లక్ష్మి దేవి అనుగ్రహం కోసం చదివేది శ్రీ లక్ష్మి అష్టోత్తరం.

మన పురాణాలు, ఇతిహాసాల ప్రకారం దేవతా మంత్రాలకు అపారమైన శక్తి ఉంటుందని భక్తుల విశ్వాసం. ఈ మంత్రాలు చదవడం వల్ల అపరమితమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. క్రమ పద్ధతిలో కనక వీటిని తప్పులు లేకుండా ఉచ్ఛరిస్తే పాజిటివ్ వైబ్స్ మన శరీరం లోకి చేరతాయని ఋషులు చెప్పడం జరిగింది. ఈ వైబ్స్ వల్ల మనకి మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు.

వీటిలో చాల ముఖ్యమైంది లక్ష్మీ మంత్రం. దీన్ని సిద్ధి మంత్రం అని కూడా అంటారు ఎందుకంటే ఇందులోని ప్రతి అక్షరం అత్యంత శక్తివంతమైందని పురానాలలో చెప్పడం జరిగింది. వీటిని మనం మనస్ఫూర్తిగా జపించి నట్లయితే అనుకూల ఫలితాలు దక్కుతాయని పెద్దలు చెప్తారు. మనకి జీవితంలో ఎదురయ్యే ఎటువంటి ఆటంకాలు అయిన తొలగిపోయి విజయాలు కలుగ చేస్తాయి.

మనం నిత్యం చదివే మంత్రాలు ఎక్కడ పడితే అక్కడ చదవకూడదు. దీని కోసం పూజగదిని శుభ్రం చేసి, లక్ష్మీదేవి ముందు నేతితో దీపం వెలిగించి ఆ తర్వాత ఎం మంత్రమయిన చదవాలి. ప్రతి శుక్రవారం దీన్ని 108 సార్లు ఉచ్ఛరిస్తే మన పరిస్థితుల్లో మార్పులు తప్పకుండా వస్తాయి. శ్రీ మహాలక్ష్మి ని ముల్లోకాలలో పూజించబడుతు ఉంటుంది. ఈమె శ్రీమహావిష్ణువు పట్టమహిషి, శ్రీ మహాలక్ష్మి ని శ్రీ మహాలక్ష్మిని మాతోనే ఉండి పోవాలని కోరుకుంటారు.

సాధారణంగా ఈ మంత్రాలను శుక్రవారం నుంచి మంత్రోపాసన మొదలుపెడతారు అందరు. దీనిని మనం పౌర్ణమి రోజు నుంచి కూడా ప్రారంభించవచ్చు. ముఖ్యం గా దీపావళి నాడు కూడా లక్ష్మీ మంత్రాన్ని పఠించడానికి చాల అత్యుత్తమైన రోజు గా పురాణాలలో చెప్పబడింది. దీని కోసం ఒక జపమాల కానీ, స్ఫటిక మాలతో కాని ఈ మంత్రపఠనాన్ని గావించాలి.

Also read:

lalitha sahasranamam telugu pdf

Dakshinamurthy stotram in telugu Pdf

Leave a Comment