Gurucharitra in telugu pdf download it by given below link.
Contents
Gurucharitra in telugu pdf
➥ gurucharitra in telugu pdf
gurucharitra in telugu pdf
శ్రీ గురు దత్తాత్రేయ నమః
గురు చరిత్ర – గురువు ని నమ్మితే సకల విజయాలు మీ వెంటే !
దత్తా అంటే ” సమర్పించినది ” అని అర్ధం. త్రిమూర్తులు అయిన అత్రి మహర్షి, అనసూయ దంపతులకు జన్మించిన కారణం గా అంటే ఇక్కడ దేవుడు తనని తాను ఈ దంపతులకు సమర్పించుకున్నాడని అందువల్లే ఈయనని దత్తా అని నామకారణం చేసారని పురాణాలలో చెప్పబడింది. తండ్రి అత్రి మహా ముని కాబట్టి తర్వాత నామము ఆత్రేయ ను కలుపుకుని దత్తాత్రేయ గా ఆవిర్భవించాడని పండితులు చెప్తారు . ఉత్తరాదిన ఈయనను దత్తాత్రేయుడు గ, శివుని అవతారం గా కొలుస్తారు. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం గ వెలుగుతున్నాడు ఈ దత్తాత్రేయుడు. ఈయన లీలలు అనేకం. దీనికి సంబందించిన అనేక కధలు ఇప్పుడు పారాయణ గా చదువుతారు అందరు. దత్తాత్రేయుడు త్రి మూర్తి స్వరూపుడు. ఈయన్ని ఆశ్రయించిన వారు తప్పక ముక్తి పొందుతారు. దత్తాత్రేయుడు కర్ణాటక రాష్ట్రం లో గాణగా పురం లో కొలువై ఉన్నాడు ఇప్పటికి.
శ్రీ గురు చరిత్ర – పారాయణ చేసే పద్ధతి:
శ్రీ గురు చరిత్ర పారాయణ ను కులమత ప్రసక్తి లేకుండా అందరు చదవచ్చు. ఈ గురు చరిత్రను పారాయణ చేయాలనుకొన్నవారు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ఏమి తినకుండా దేవుని ముందు కూర్చుని, దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి పారాయణ చెయ్యడం మొదలు పెట్టాలి. కాఫీ, పాలు లాంటి ద్రవపదార్దాలు తీసుకోవచ్చును.
ఒకవేళ ఉదయం పారాయణ చెయ్యడానికి సమయం లేక పోవడం కాని అవకాశం లేకపోవడం లాంటివి ఉన్నవారు సాయంత్రం వేళ స్నానం చేసి పారాయణ చేసుకోవచ్చును. పారాయణ చెయ్యడానికి రోజుకి ఇన్నిఅధ్యాయాలు చదవాలి అని లెక్క ఉంది, ఒక రోజులో అన్ని
అధ్యాయాలు చదవలేని వారు ఉదయం కొన్ని అధ్యాయాలు మరల సాయత్రం స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు చదవచ్చు. ఒకవేళ సాయత్రం కూడా పారాయణ చేయలేని వారు రాత్రి సమయం స్నానం చేసి
ఏమి తినకుండా అన్ని అధ్యాయాలు చదవచ్చు.
ఆహార నియమాలు :
ఒక్క రోజులో మొత్తం గ్రంధం పారాయణ పూర్తిచేయాలనీ అనుకున్నవారు కేవలం పండ్లు, పాలు తీసుకోవచ్చు. మనసులో గురు చరిత్ర మీద లగ్నం చేసుకుని చదవాలి. పారాయణ చేస్తున్నప్పుడు కాల కృత్యాల కోసం వెళ్తే మరల స్నానం చేసి ఎక్కడ ఆపితే అక్కడ నుండి చదవడం మొదలు పెట్టాలి.
అధ్యాయాలు చదివే విధానం :
సప్తాహ పారాయణం అంటే – ఒక వారము – లేదా 7 రోజులు పూర్తి చెయ్యలేని వారు
ద్విసప్తాహ పారాయణం అంటే – రెండు వారములు
త్రి సప్తాహ పారాయణం అంటే – 21 రోజులు ఇలా విభజించుకుని చదవాలి.
ఇలా కుడా చదవడానికి అవకాశం లేని వారు రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదవచ్చు. స్త్రీలు బహిష్తు ( PERIODS ) సమయం లో ఈ గురు చరిత్ర పారాయణ చెయ్యకూడదు.
చెయ్యకూడనివి :
మనం పారాయణ చేసే గ్రధం ఎవ్వరికి ఇవ్వకుండా ఉండడం మంచిది. అలాగే ఈ గురు చరిత్ర పారాయణ చేసే వారు, వారికి ఉన్న చెడు అలవాట్లను వదిలి పెట్టాలి. అలాగే మాంసాహారం కూడా తినకూడదు. గురు గురు చరిత్ర పారాయణ మొదలు పెట్టి ఆఖరి అధ్యాయం పూర్తి అయ్యేవరకు ధూమపానం, మాంసాహారం, మద్యపానం (ALCOHOL ) ఇవేవి తీసుకోకూడదు.
చెయ్యాల్సినవి :
గురు చరిత్ర పారాయణ పూర్తి చేసాక కొద్ది పాటి ( తమ శక్తి కొలది ) దక్షిణ తో ఈ గ్రంధం ( గురు చరిత్ర పుస్తకం ) ఒకటి దానం చెయ్యాలి. ఇలా దానం చెయ్యడం వలన ముల్లోకాలలోను దానం చేసిన పుణ్య ఫలం వస్తుంది. అలాగే తమ శక్తీ కొలది ఒక బ్రాహ్మణుడు కి భోజనం పెట్టి దక్షిణ తాంబూలం పెట్టి గురువే తమ ఇంట భోజన సత్కారం అందుకున్నాడని తలచి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవాలి. అలా అవకాశం లేకపోయిన యెడల భోజన రూపేణ కొంత సొమ్మును దానం గా ఇవ్వవచ్చు.
స్నానం చెయ్యడానికి అవకాశం లేని యెడల:
ఈ గురు చరిత్ర పారాయణ చేయుచున్నప్పుడు ఒకవేళ ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినట్లయితే వారికి స్నానం చేసే అవకాశం ఉండదు. అలాంటి వారికి ఒక పరిహారం కూడా చెప్పబడింది. దీనికోసం క్రింది ఇచ్చిన శ్లోకం చెప్పుకుంటూ తీర్ధాన్ని గురుపాదోదకంగా భావించి, కొంచెం నీళ్ళు తాగి చేతి లో మిగిలిన నీళ్ళు నెత్తి మీద చల్లు కోవాలి.
అపవిత్రః పవిత్రోవా సర్వావస్దాన్ గతోపివా |
యస్మరేత్ పున్దరీకాక్షం స బాహ్యభ్యంతర శ్సుచి:
స్వయం గా గురు చరిత్ర ను పారాయణ చెయ్యలేని వారు శ్రీ గురు చరిత్ర అధ్యాయాలను కళ్ళు మూసుకుని ఆయన్నే ధ్యానిస్తూ అద్యాయాలను వింటున్న కూడా చదివినంత పుణ్యం లభిస్తుంది అని స్వయం గా ఆ దత్తాత్రేయ స్వామి స్వయం గా చెప్పడం జరిగింది. కావున శ్రీ గురు చరిత్ర చదవలేనివారు కనీసం రోజులో కొద్ది సేపు ఆయన చరిత్ర లో ఉన్న అద్యాయాలను వినండి. విని తరించండి.
* జై గురు దత్త *