విశాఖ జిల్లాలో విషాదం: మరణం లోనూ వీడని స్నేహం!
నదిలో స్నానం చేయాలనే ఇద్దరు చిన్నారుల సరదా వారి ప్రాణాలను తీసింది. విశాఖ జిల్లా విజయరామరాజుపేట ప్రాంతానికి చెందిన వివేక్, నిఖిల్ సాయి స్నానం చేసేందుకు తుంపాల సమీపంలోని శారదా నది వద్దకు వెళ్లారు. చిన్నబాబు కాలనీ వద్ద శారదానది లోకి దిగారు. ప్రమాదవశాత్తు ఇద్దరు నీటిలో మునిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న వివేక్, నిఖిల్ ఇద్దరు మంచి స్నేహితులు. మరణం లోనూ ఈ ఇద్దరు కలసే చనిపోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ బిడ్డలు తమ కంటే ముందే కడతేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
- మరణం లోనూ వీడని స్నేహం
- విశాఖ జిల్లా అనకాపల్లిలో విషాదం
- చిన్నబాబు కాలనీ వద్ద శారదానదిలో దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
- స్నానానికి దిగి ప్రాణాలు కోల్పోయిన వివేక్, నిఖిల్ సాయి
- తమ బిడ్డలు తమ కంటే ముందే మరణించడంతో…
- కన్నీరు మున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు