‘కలర్ ఫొటో’ విలన్ రామరాజును చూశారా.?

Spread the love

ప్రముఖ కమెడియన్ సునీల్ పుట్టినరోజు ఈ సందర్భంగా ‘కలర్ ఫొటో’ సినిమాలో ఆయన లుక్‌ను టీం రిలీజ్ చేసింది. లుక్‌లో సునీల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. జీపులో స్టైల్‌గా కూర్చుని సీరియస్‌గా కనిపిస్తున్న సునీల్ తన లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇందులో ఆయన పేరు ఎస్సై రామరాజు. ఈ సినిమాలో కమెడియన్ సుహాస్ కథానాయకుడిగా నటిస్తున్నారు. విజేత, పేపర్‌ బాయ్‌, మజిలీ, డియర్‌ కామ్రేడ్‌, ప్రతిరోజూ పండగే సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సుహాస్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. నటుడు సందీప్ రాజ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ సినిమాను హృదయ కాలేయం సినిమాకు దర్శకత్వం వహించిన స్టీవెన్‌ శంకర్‌ అలియాస్‌ సాయి రాజేష్, లౌక్యా ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. చాయ్‌ బిస్కెట్‌ యూట్యూబ్‌చానల్‌ కోసం కలిసి పనిచేసిన సుహాస్, సందీప్‌ల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. సుహాస్‌కు జోడిగా ఛాందిని చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

For more news :

Like us at Facebook Watch Us on YouTube Follow us on

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *