దేశంలో విజృంభిస్తున్న కరోనా | Rapid Hike Of Corona Cases In India | 6TV

Spread the love

దేశంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకీ కోవిడ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో నమోదైనన్ని కేసులు తిరిగి ప్రస్తుతం నమోదవుతుండటం భయ పెడుతోంది. తాజాగా దేశ వ్యాప్తంగా 81 వేల 466 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1 కోటి 23 లక్షల 3వేల 131కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా నుంచి ఇప్పటి వరకూ 1కోటి 15లక్షల 25వేల 39మంది కోలుకోగా.. ప్రస్తుతం 6లక్షల 14వేల 696 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కారణంగా 1లక్షా 63వేల 396 మంది మృతి చెందారు. తాజాగా ఒక్క రోజే కరోనా కారణంగా 469 మంది మృతి చెందడం ఆందోళన రేపుతోంది. మరోవైపు నిన్న 50వేల 356 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రివకరీ రేటు 93.68శాతంగా.. మరణాల రేటు 1.33 శాతంగా ఉంది.

  • దేశంలో విజృంబిస్తున్న కరోనా
  • దేశంలో అత్యధిక స్థాయిలో కరోనా కేసులు
  • కొత్త‌గా 81,466 మందికి వైరస్
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,03,131
  • తాజాగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 50,356 మంది
  • కరోనా నుంచి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,15,25,039
  • ఒక్కరోజులో వైరస్ కారణంగా 469 మంది మృతి
  • మొత్తం మృతుల సంఖ్య 1,63,396
  • ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,14,696
  • దేశ వ్యాప్తంగా 6,87,89,138 మందికి వ్యాక్సిన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *