ఇంతకీ పవన్ ఏం చెప్పాడు
జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పాలన గురించి పవన్ కల్యాణ్ ప్రజలకు నివేదిక ఇస్తున్నా అంటూ సూపర్ హిట్ సినిమా ప్రోమోలా రిలీజ్ చేశాడు. దీంతో ఆంధ్రప్రజలు 14వ తేదీ కోసం ఎదురుచూశారు. సినిమా సూపర్ హిట్ అవుతుందని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుల్లా మారింది పరిస్థితి. అక్కడ కొత్త విషయమేం లేదు. గత కొన్ని రోజులుగా టీడీపీ నాయకుల విమర్శలే ఓ పుస్తకం రూపంలో తెచ్చారు కానీ అంతకు మించి ఏమీ లేదు. ఇదే విషయాన్ని ఓ విలేకరి డైరెక్ట్ గా అడిగేశాడు కూడా, అయినా సమాధానం ఆయన నివేదికలాగే క్లారిటీ లేకుండా ఉందనేది విశ్లేషకుల భావన. ఇంతకీ ఆ నివేదిక ఏం చెప్పింది అంటే అమరావతిపై క్లారిటీ కావాలి, ఇసుక పాలసీలో క్వాలిటీ కావాలి, మద్యం అమ్మకాలపై క్లారిఫికేషన్ కావాలి. సామాన్యుల గొంతుకలా కాకుండా కేవలం ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ని చదివినట్టుంది తప్ప తనేదో ఓ వారం రోజులు కష్టపడి తయారుచేసిన నివేదికలా అయితే మాత్రం లేదనేది వైసీపీ నేతల వ్యాఖ్య. తాను అధికారంలోకి వచ్చాక ఏం చేస్తాను, ఎలా చేస్తాను, ఎప్పుడు చేస్తాను అనే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే క్లియర్ గా చెప్పారు కదా.. మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడిగిన రిపోర్టర్ కి కూడా సరిగా సమాధానం చెప్పలేకపోయారు పవన్ కల్యాణ్.
ఇంతకీ పవన్ కల్యాణ్ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏం చెప్పారంటే ప్రోమో హిట్, మూవీ ఫట్ అని అంతకు మించి ఏం లేదు..