విశాఖ ఏజెన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం : లోయలో పడిన లారీ!
విశాఖ ఏజెన్సీలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాడేరు సమీపంలో ఓ లారీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా…మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఒడిషాలోని కొలహాండి జిల్లా జపట్నా నుంచి లారీలో రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పాడేరు మండలం కొమ్మాలమ్మ పనుకు వద్దకు చేరుకొనేసరికి లారీ లోయలోకి పడిపోయింది. ఈ ఘటన చూసిన కొంతమంది 108 వాహనానికి ఫోన్ చేయడంలో సిబ్బంది అక్కడకు చేరుకుని గాయపడిన వారిని చోడవరం, మాడుగుల హాస్పిటల్ కి తరంచి చికిత్స అందిస్తున్నారు. లారీలో ఎనిమిది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. వీరిలో ఒకరు మృతి చెందగా… మిగతా ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని విశాఖ kghకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- లోయలో పడ్డ లారీ
- విశాఖ ఏజెన్సీలో రోడ్డు ప్రమాదం
- పాడేరు కొమ్మాలమ్మ పనుకు సమీపంలో లోయలో పడ్డ లారీ
- ప్రమాదంలో ఒకరు మృతి…మరో ఏడుగురికి గాయాలు
- గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమం
- ఒడిషాలోని జపట్నా నుంచి రాజమండ్రి వెళ్తుండగా ప్రమాదం
- తీవ్రంగా గాయపడ్డ నలుగురికి విశాఖ కేజీహెచ్ లో చికిత్స