వసూళ్లలోనూ.. ‘హిట్టే’ ఎంతంటే..?
నాచురల్ స్టార్ నాని నిర్మించిన హిట్ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. నాని ముందు తీసిన ‘అ’కి జాతీయ అవార్డులు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పడు హిట్ మూవితో మరో ‘హిట్’ తన ఖాతాలో వేసుకున్నాడు. ‘ఫలక్‌నుమా దాస్’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో నిన్న విడుదలైన ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతోంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్గా నటించింది. హిట్‌ను కొత్త దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు.
కాగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు చెప్పుకోదగ్గ వసూళ్లనే రాబట్టినట్లు తెలుస్తుంది. ఏపీ, తెలంగాణాలో కలిపి హిట్ మూవీ 1.4 కోట్ల షేర్ వసూలు చేసిందని టాక్. దీనికి తోడు సినిమాకు పాజిటివ్ టాక్ ఉండటంతో శనివారం, ఆదివారం వసూళ్లు మెరుగయ్యే అవకాశం ఉంది. హీరో నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతగా నానికి ఇది రెండో చిత్రం. గతంలో నాని ‘అ’ అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. సంగీతం వివేక్ సాగర్ అందించాడు. సినిమా విషయానికి వస్తే.. ఒక మిస్సింగ్ చుట్టూ తిరిగే కథ ఇది. ఆ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో విశ్వక్ సేన్ నటన ఆకట్టుకుంటుంది.
For more news :
Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter