దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం!
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కేవలం ఒక్క వారంలో కరోనా కేసుల సంఖ్య 51 శాతం మేర పెరిగాయి. గత ఏడు రోజుల్లో కరోనా కేసుల సంఖ్య ఒక లక్షా 30 వేలను దాటింది. వారం రోజుల వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. మరో వైపు కరోనా మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరగడం కలవరపెడుతోంది. 51 శాతానికి పైగా కరోనా కేసులు పెరిగాయి. ఇప్పటికి వారం రోజుల వ్యవధిలో దేశంలో కరోనాతో 18 వందల 57 మంది ప్రాణాలు కోల్పోయారు. సంభవించాయి. మరో వైపు మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 40 వేల 414 కేసులు నమోదుకావడం వైరస్ ఉధృతికి అద్దం పడుతోంది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలను దాటింది.
- పెరుగుతున్న మరణాలు
- దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం
- ఒక్క వారంలో 51 శాతం మేర పెరిగిన కరోనా కేసులు
- వారంలో ఒక లక్షా 30 వేలు దాటిన కేసుల సంఖ్య
- 7రోజుల వ్యవధిలో కరోనాతో 1857 మంది మృతి
- దేశంలో 5 లక్షలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య
Also Watch: