AP New SEC Neelam Sahni Released Schedule For MPTC & ZPTC Election | 6TV

Spread the love

ఏపీలో పరిషత్‌ ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ షెడ్యూల్ ను ఎస్ఈసీ నీలం సాహ్ని విడుదల చేశారు. ఈనెల 8న పోలింగ్‌ నిర్వహించి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అవసరమైన చోట 9న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియ ఆగిన చోటే తిరిగి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన రోజే నీలం సాహ్నీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 8న పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా రీ పోలింగ్ చేపట్టాల్సి వస్తే ఈ నెల 9న నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. కోర్టు పరిధిలో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు ఉండవని ఈసీ స్పష్టం చేసింది. ఏకగ్రీవాలు మినహా మిగిలిన చోట్ల ఎన్నికలు జరుపనున్నారు.
గత ఏడాది 660 జడ్పీటీసీలకు గాను 652 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వాటిలో 126 ఏకగ్రీవాలు కాగా, మిగిలిన 526 స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 10 వేల 47 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, పలు అంశాల కారణంగా 354 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిలిచిపోయాయి. 2 వేల 371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 7,322 స్థానాలకు ఈ నెల 8న పోలింగ్ నిర్వహించనున్నారు. పరిషత్ ఎన్నికల కోసం 33 వేల 663 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ తెలిపింది. సుమారు 2 కోట్ల 82 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.


ఏపీలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
పరిషత్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్‌ఈసీ నీలం సాహ్ని
ఈ నెల 8న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తారు.
అవసరమైన చోట 9న రీ పోలింగ్‌
10న ఫలితాలు విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *