ఈ వంట తిన్నాక బాయ్ ఫ్రెండ్ పరిస్థితి ఏంటో…!

Spread the love

నచ్చిన వంటను వండి పెడితే ఏ బాయ్ ఫ్రెండ్ అయినా మెచ్చుకోకుండా ఉంటారా? ఇదిగో ఇక్కడ శృతి హాసన్ కూడా అదే చేసింది. ప్రియుడు కోసం ప్రయోగం చెయ్యడానికి ఏమాత్రం వెనకాడలేదు ఈ అమ్మడు. ఇంతకీ శృతి ఏం వంట చేసింది అనే కదా మీ డౌట్? దానికి పలానా వంట అని పేరు పెట్టడం కష్టం. ఎందుకంటే..అందులో నూడిల్స్, పైనాపిల్, బనానా, కోకోనట్, బ్రొకోలితో పాటు ఇంకా ఏవేవో ఉన్నాయి. ఇక ఆ వంట చేస్తూ మధ్యలో శృతి ఎక్కడికి వెళ్లిందో ఏమో కానీ..అది కాస్త మాడిపోయింది.

  • ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో.. ఇది వేస్టెడ్ పైనాపిలా లేక రోస్టెడ్ పైనాపిలా! అంటూ పంచ్ లు వేస్తున్నారు ఫ్యాన్స్. శంతను హజారికా గువహతికి చెందిన రాపర్ కం ఇలస్ట్రేటర్.. డూడుల్ ఆర్టిస్ట్. త్వరలో విడుదల కానున్న మ్యూజిక్ వీడియో కోసం శ్రుతి హాసన్ తో కలిసి పని చేసారు. ఇటీవలే తండ్రి కమల్ హాసన్ కి అతడిని శ్రుతి పరిచయం చేయగా ఆయన చాలా హ్యాపీ ఫీలయ్యారు. కమల్ హాసన్ కి శంతను అదిరిపోయే ఆర్ట్ ను గిఫ్ట్ కూడా ఇచ్చారు.

-మమత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *