ఏవోబీలో ముగ్గురు మావోయిస్టు ఎస్‌జడ్‌సీ సభ్యులు లొంగుబాటు!

Spread the love

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా ఎస్సీ ఎదుట వీరు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాకు చెందిన మైను అలియాస్‌ శంభు, రామా ఆప్కాలు 2009లో మావోయిస్టు పార్టీ జేగురుకొండ కమిటీలో చేరారు. 2010లో నారాయణపట్న ఏరియా కమిటీ ప్లటూన్‌ సభ్యులుగా నియమితులయ్యాడు. కొంతకాలం నుంచి ఏవోబీ ఎస్‌జడ్‌సీ మిలిటరీ ప్లటూన్‌ ఏరియా కమిటీ సభ్యులుగా పని చేస్తున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా జోడంబో పోలీస్టేషన్‌ పరిధి బెజ్జింగి గ్రామానికి చెందిన రఘు ఖర 2017 సెప్టెంబరులో గుమ్మా ఏరియా కమిటీ సభ్యుడిగా దళంలో చేరాడు. ప్రస్తుతం ఏవోబీ ఎస్‌జడ్‌సీ ఏరియా కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇతనిపై లక్ష రూపాయల రివార్డు ఉంది. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని తాము ఇచ్చిన పిలుపుతో వీరు లొంగిపోయారని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ రిషికేశ్‌ కిలారీ చెప్పారు. రివార్డుల సొమ్మును వారికే అందజేసి, పునరావాసంతోపాటు ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

  • ఏవోబీలో ముగ్గురు మావోయిస్టు ఎస్‌జడ్‌సీ సభ్యులు లొంగుబాటు
  • 2009లో మావోయిస్టు కమిటీలో చేసిన సభ్యులు
  • రఘు ఖరపై లక్ష రూపాయల రివార్డు
  • పునరావాసంతోపాటు ఉపాధి కల్పిస్తాం -ఎస్పీ రిషికేశ్ కిలారీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *