తల్లికే తలవంపు: వివాహేతర సంబంధం.. ముగ్గురు పిల్లలను బావిలోకి..

Spread the love

హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయంటే.. భూ సమస్య లేక ఆర్థిక సమస్యలు అనుకునేవారు ఒక్కప్పుడు కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటి హత్యలు, ఆత్మహత్యలు పడక సుఖానికి తలొగ్గుతున్నాయి. వివాహేతర సంబంధంలో పిల్లలకు బంగారు భవిష్యత్ ఇవ్వాల్సిన తల్లిదండ్రులు వారిని కడతేర్చి తమ పడక సుఖాన్ని పంచుకుంటున్నారు. రోజుకో ఘటన.. తల్లికే తలవంపు తెస్తున్నాయి. మొన్న వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తొమ్మిదేండ్ల కన్న కొడుకునే హతమార్చింది.. నిన్న కట్టుకున్న భర్తను. నేడు ఏకంగా ముగ్గురి పిల్లలను బావిలోకి తోసేసి చంపేసింది.. ఓ దుర్మార్గురాలు. ఈ అమానుష ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పెద్ద కమ్మవారిపల్లిలో చోటుచేసుకుంది.
వివారాల్లోకెళ్తే.. అదే గ్రామానికి చెందిన రమేశ్‌తో అరుణమ్మకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. రమేశ్ తన బంధువు గురుబాబుతో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. గురుబాబు తరచూ వీళ్లింటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో అరుణమ్మతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన రమేశ్.. తన భార్యను పుట్టింటికి పంపేశాడు. ఇదే అదనుగా తీసుకొన్న గురుబాబు.. తనతో సంబంధం కొనసాగించాలని అరుణమ్మపై ఒత్తిడి తెచ్చాడు. అతడి ఒత్తిడికి తలొగ్గి.. అతడితో ఉండేందుకు ఒప్పుకుంది. ఈ క్రమంలో తన సంబంధానికి అడ్డుగా ఉన్నారని చెప్పి.. కన్నబిడ్డలనే చంపాలని ప్లాన్ వేసింది. ఆదివారం రాత్రి పొలం బావి వద్దకు తన బిడ్డల్ని తీసుకెళ్లి.. అందులోకి వాళ్లను తోసేసింది. అర్ధరాత్రి ఒంటరిగా ఇంటివైపు వస్తుండగా చూసిన గ్రామస్తులు ఆమెను నిలదీయగా.. భయపడి తాను కూడా బావిలోకి దూకేసింది. వెంటనే ఆమె ప్రాణాలను కాపాడారు. అయితే, అప్పటికే ముగ్గురు పిల్లలు చనిపోయారు. నిందితురాలు, ఆమె భర్త రమేశ్, గురుబాబు, గురుబాబు భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

For more news :

Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *