తిరుపతి లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన గురుమూర్తి!
YCP MP Candidate Gurumurthy Filed Nomination For Tirupati By Polls | తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ తరపున బరిలో దిగుతున్న పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం…స్థానిక నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరాగా నామినేషన్ దాఖలుకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు నగరంలోని విఆర్సీ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి…గురుమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.
కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి, అనిల్, గౌతంరెడ్డి, కొడాలి నాని, ఆదిములపు సురేష్, కన్నబాబు పాల్గొన్నారు. అనంతరం మూడు సెట్ల నామినేషన్లను కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకి అందజేశారు. ప్రజలు తనను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని గురుమూర్తి కోరారు. భారీ మెజార్టీ దిశగా వెళ్తున్నామని, 5 లక్షల ఓట్ల మెజార్టీతో తిరుపతి పార్లమెంట్ గెలుచుకోబోతున్నామని మంత్రులు అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ మెజారిటీని ఆపలేరని అన్నారు..

- తిరుపతి లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన గురుమూర్తి
- వైసీపీ తరపున బరిలో దిగుతున్న గురుమూర్తి
- నామినేషన్ దాఖలుకు భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు
- కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, వైసీపీ ముఖ్యనేతలు
Also See:
దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం!
జానారెడ్డి అరాచకాలను చూడలేకే కార్యకర్తలు కాంగ్రెస్ ను వీడుతున్నారు: బాల్క సుమన్
కుషాయిగూడలో అగ్నిప్రమాదం: మంటల్లో కాలిబూడిదైన డీసీఎం వ్యాన్!
దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం | Corona Cases Increasing In India | 6TV
టీడీపీ మహిళా కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడి | Attack On TDP Women Activists | 6TV
విజృంభిస్తున్న కరోనా ..! Corona Second Wave | Cases Increasing In India | 6TV
ఆ లక్ష్యంతోనే పని చేస్తున్నం BJP Leader Somu Veeraju Intyresting Comments On Pawankalyan | 6TV
హోలీ సంబరాల్లో ఎమ్మెల్యే…! Dubbaka MLA Raghunandan Rao Holi Celebrations | 6TV
శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయ విశిష్టత Sangameshwara Temple | Kurnool | 6TV
ఘనంగా ముగిసిన తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు | TTD News | 6TV
మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్..ఐదుగురు మావోల మృతి | Encounter at Maharashtra | 6TV
YCP MP Candidate Gurumurthy Filed Nomination For Tirupati By Polls | AP NEWS | 6TV