వీరితో సీఎం జగన్ కీలక భేటీ
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కీలక భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో వరల్డ్ బ్యాంక్ దక్షిణాసియా మానవ వనరుల అభివృద్ధి విభాగం రీజనల్ డైరెక్టర్ షెర్బర్న్ బెంజ్ ఇతర అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులపై సీఎం వారితో చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం ప్రశంసలు కురిపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు కొనియాడారు. మానవ వనరులపై పెట్టుబడి ద్వారా అభివృద్ది ఫలితాలు వస్తాయని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని ప్రతినిధులు వెల్లడించారు.
For more news :
Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter