అరుదైన ఘటన: ఒకే కాన్పులో అరుగురు.. ఎక్కడంటే.?
ఓ కాన్పులో ఇద్దరు పిల్లలు పుడితేనే అద్భుతంగా చెప్పుకుంటాం. అలాంటిది ముగ్గురు పుడితే అమ్మో అంటాం. అదే ఏకంగా ఆరుగురు పుడితే వినగానే షాకవుతాం. ఎందుకంటే అది అత్యంత అరుదుగా జరిగే ఘటన. ఇలాంటి అరుదైన ఘటనే మధ్యప్రదేశ్‌లోని షెవోపూర్ జిల్లా ఆసుపత్రిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఒకే కాన్పులో ఒక మహిళ ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. జిల్లాలో ఈ తరహా ఘటన జరగడం ఇదే మొదటిసారి. సిక్ న్యూబార్న్స్ కేర్ యూనిట్లో నవజాత శిశువులను అబ్జర్వేషన్లో ఉంచారు. అయితే, ఆరుగురు నవజాత శిశువుల్లో ఇద్దరు పుట్టీపుట్టగానే కన్నుమూశారు. తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఒకే కాన్పులో ఆరుగురు జన్మించడం ఇది తొలిసారి కాదు. ఏడుగురు కూడా జన్మించిన ఘటనలు ఉన్నాయి. 1997లో యూఎస్‌లోని ఐయోవా రాష్ట్రంలో కెన్నీ, బాబి మెక్‌కాగే దంపతులు తొలిసారి ఒకే కాన్పులో ఏడుగురు శిశువులకు జన్మనిచ్చారు. అప్పట్లో ఈ దంపతులు యూఎస్‌లో చాలా ఫేమస్ అయిపోయారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వీళ్లను పిలుపించుకుని వ్యక్తిగతంగా కలిశారు. అలాగే ప్రముఖ టీవీ హౌస్ట్ ఓప్రా విన్ఫ్రే తన షోకి ఈ దంపతులను ఆహ్వానించారు. మళ్లీ 22 ఏండ్ల తర్వాత ఇరాక్‌లో ఏడుగురు శిశువులు ఒకే కాన్పులో జన్మించారు. 1983లో ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్‌లో గ్రహమ్ వాల్టన్, జనేట్ లీడ్ బెటర్ దంపతులు తొలిసారి ఒకే కాన్పులో ఆరుగురు శిశువులకు జన్మనిచ్చారు. ఈ పిల్లలు వాల్టన్ సెక్స్టుప్లెట్స్గా గుర్తింపు పొందారు.
For more news :
Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter