పెళ్లింట విషాదం.. 30 మందితో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా..
వారందరూ ఆనందోత్సహాలతో పెండ్లకి హాజరయ్యారు. వేడుకల్లో పాల్గొని అదే ఉత్సాహంతో తిరిగి ఇంటికి ప్రయనమయ్యారు. కానీ అనుకోని పేను ప్రమాదం రానే వచ్చింది. ఒక్కసారిగా ఆనందోత్సాహలతో మునిగి తేలిన వారు మృత్యు ఘోషతో విలపించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తెనాలి మండలం చినరావూరులో పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా చుండూరు మండలం చినపరిమి వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో నగుగురు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. వారిన హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అతి వేగం వల్ల అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తాపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 30 మంది ప్రయాణిస్తునట్లు సమాచారం. ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు కనిపించాయి. మృతలను చూసి తోటి ప్రయాణికులు గుండలవిసేలా రోదించారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంతో పెళ్లింట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
For more news :
Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter