తలైవాకు దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు!

Spread the love

Super Star Rajinikanth to Receive Dadasaheb Phalke Award | సూపర్ స్టార్ రజనీకాంత్ కు దాదాసాహేబ్ పాల్కే అవార్డు దక్కింది. సినీ పరిశ్రమకు చేసిన సేవకు గాను దాదాసాహేబ్ పాల్కే అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. రజనీకి దాదాసాహేబ్ పాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం తరపున ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఆయనను ఎంపిక చేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. తమిళనాడు ఎన్నికలకు ముందు ఆయనకు ఈ అవార్డును ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ నెల 6న తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. రజనీకాంత్ కు 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. దాదాసాహెబ్ పాల్కే అవార్డుకు తమ అభిమాన హీరో ఎంపికవ్వడంతో రజనీకాంత్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. చెన్నైలో రజనీ అభిమానులు సందడి చేస్తున్నారు.

  • తలైవాకు దాదాసాహేబ్ ఫాల్కే
  • సూపర్ స్టార్ రజనీకాంత్ కు దాదాసాహేబ్ పాల్కే అవార్డు
  • సినీ పరిశ్రమకు చేస్తున్న సేవలకు గాను దాదాసాహేబ్ పాల్కే అవార్డు ప్రకటించిన కేంద్రం
  • రజనీకి అవార్డు ప్రకటించిన ప్రకాష్ జవదేకర్
  • రజనీకి 51వ దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు
  • రజనీకి 2000లో పద్మభూషన్, 2016లో పద్మవిభూషణ్ అవార్డులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *