విమానంలో పావురం.. చివరికి..
ఎక్కడో ఓ చోట వింత ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే అలాంటి వింత ఘటనే విమానంలో చోటు చేసుకుంది. పక్షుల వల్ల విమానం ప్రయాణిస్తున్న సమయంలో తరుచు ప్రమాదాలు చోటు చేసుకోవడం మనం చూస్తునే ఉంటాం. అయితే ఇక్కడ మాత్రం ఏకంగా పావురంలో విమానం లోపల గగన విహారం చేసింది. ఈ ఘటన అహ్మదాబాద్- జైపూర్ గో ఎయిర్ విమానంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి జైపూర్ వెళ్లాల్సిన గోఎయిర్ విమానంలోకి ప్రయాణికులు ఎక్కారు. విమానం బయలుదేరుతుందనగా ఓ పావురం రివ్వుమంటూ తన రెక్కలను టపటప లాడిస్తూ విమానంలో ప్రత్యక్షమైంది. విమానం గేట్లు మూశాక ఓ ప్రయాణికుడు తన లగేజ్ బ్యాగ్ ను తెరవగానే లోపల నుంచి పావురం బయటకు వచ్చింది. విమానం లోపలకు పావురం రావడం ఏమిటని ఆశ్చర్యపోయిన ప్రయాణికులు అనంతరం తేరుకొని దాన్ని తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు. పావురం విమానంలోపల చక్కర్లు కొడుతుండగా దాన్ని పట్టుకునేందుకు గోఎయిర్ సిబ్బంది నానా తంటాలు పడ్డారు. ఎట్టకేలకు పావురాన్ని పట్టుకొని కిందకు తీసుకువెళ్లారు. దీంతో గోఎయిర్ విమానం అరగంట ఆలస్యమైంది. జైపూర్ నగర విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత దిగిన విమాన ప్రయాణికులు గోఎయిర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా ఏయిర్ పోర్టు సిబ్బంది అలర్ట్ గా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
For more news :
Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter