ఫస్ట్‌లుక్‌ ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా.?

Spread the love

పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లో బిజిబిజిగా ఉంటునే ఓ వైపు సినిమాలనూ వదలట్లేదు. జనసేన పార్టీతో ప్రజలతో మమేకమవుతున్నాడు. ప్రజా సమస్యలపై పోరాడుతునే సినిమాలు చేస్తూ.. వెళ్తున్నాడు. అందులో భాగంగా MCA ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో నివేదా థామస్‌, అనన్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోందని సమాచారం. ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో చిత్ర సంగీత దర్శకుడు థమన్‌.. ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించాడు. తాజాగా చిత్ర బృందం మార్చి 2 సాయత్రం 5 గంటలకు పవన్‌ ఫస్ట్‌లుక్‌‌ను విడుదల చేస్తున్నామని కన్ఫామ్ చేసింది. మరోవైపు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న ఫస్ట్‌సాంగ్‌ను విడుదల చేయనున్నారని సమాచారం.

For more news :

Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *