జగన్‌కు ‘నేవీ’ షాక్..

Spread the love

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడుకు నేవీ బ్రేకులు వేసినట్టు తెలుస్తోంది. విశాఖలోని మిలీనియం టవర్స్‌ను సచివాలయంగా చేసుకుని అక్కడి నుంచి పరిపాలన చేయాలనుకున్న జగన్ ఆలోచనకు నేవీ అడ్డు చెప్పినట్టు తెలిసింది. విశాఖలోని రుషికొండ వద్ద మిలీనియం టవర్స్ ఉన్నాయి. దానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో INS కళింగ ఉంది. తూర్పు నావికాదళానికి కేంద్రమైన విశాఖలో ఈ ఐఎన్ఎస్ కళింగ కీలక స్థావరం. 734 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఉన్న ఈ ఐఎన్ఎస్ కళింగలో అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తోంది. సాంకేతికంగా అత్యున్నత స్థాయిగల మిసైల్స్‌కు ఈ ప్రాంగణం ఆధారం. అలాంటి కీలక ప్రాంతానికి దగ్గరగా ఉన్న మిలీనియం టవర్స్ వద్ద జనసంచారాన్ని పెంచుకుంటూ పోతే అది భద్రతా పరమైన సమస్యలకు దారి తీస్తుందంటూ నేవీ అభ్యంతరాన్ని లేవనెత్తినట్టు పేర్కొంది.
మిలీనియం టవర్స్‌కు అనుమతేది..?
మిలీనియం టవర్స్‌లో ఏపీ ప్రభుత్వానికి నేవీ అనుమతి ఇవ్వకపోవడం వెనుక ఆసక్తికరమైన కారణాన్ని చెప్పుకొచ్చారు బొండా ఉమా. సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలనుకుంటున్న మిలీనియం టవర్స్‌కు సమీపంలో.. దేశ భద్రతకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగ ఉండటమే కారణమంటున్నారు. దేశ రక్షణకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగ ఐఎన్ఎస్ సుమారు 734 ఎకరాల మేర విస్తరించి ఉందని.. సమీపంలో జనావాసాలను ఎలా అభివృద్ధి పరుస్తారని నేవీ ప్రశ్నించిందని.. జగన్ ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు.
నేవీ అధికారుల లేఖ!
శత్రుదేశాలకు విశాఖపట్నం ప్రధాన లక్ష్యమని.. ఇక్కడ ఎన్నో పరిశ్రమలు, కేంద్ర సంస్థలు ఉన్నాయని తెలిపిందన్నారు. కాబట్టి.. దేశభద్రత దృష్ట్యా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోకపోవడమే మేలని నేవీ అధికారులు చెప్పారట. ఒకసారి రాజధాని ఏర్పాటైతే.. ఆ ప్రాంతమంతా అభివృద్ధి అవుతుందని.. జనావాసాలతో కిటకిటలాడుతుందని.. దీంతో చాలా సమస్యలు ఎదురవుతాయని నేవీ ఆందోళన వ్యక్తం చేసిందని ఉమా చెప్పారు. ఐఎన్ఎస్ కళింగ వ్యూహాత్మక ప్రాంతమని.. ఇక్కడ రాజధాని ఏర్పాటుపై సాంకేతిక, భౌగోళిక అంశాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని లేఖలో ప్రస్తావించారని ఆయన చెప్పుకొచ్చారు.
మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్!
మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు చేయాలని.. మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్‌ను తరలించాలని ఆలోచన చేసింది. ఇటీవలే నిధులు కూడా విడుదల చేశారు. ఉగాది సమయానికి కార్యాలయాలను తరలించాలని భావించారు. ఓవైపు హైకోర్టులో కూడా మూడు రాజధానుల నిర్ణయంపై పిటిషన్లు దాఖలు కావడంతో తరలింపు ప్రయత్నాలు కాస్త నెమ్మదించాయి. ఇప్పుడు తాజాగా నేవీ అభ్యంతరం చెప్పిందంటూ టీడీపీ కొత్త వాదన తెరపైకి తెచ్చింది.

For more news :

Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *