కెప్టెన్ భక్తవత్సలం నాయుడిని చూశారా.?

Spread the love

‘గురు’ మూవీ డైరెక్టర్ కొంగర సుధా దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం ‘సూరరాయి పోట్రు’ వస్తున్న సంగంతి తెలిసిందే. ఈ మూవీ రోజుకో లుక్ తో అంచనాలను భారీగా పెంచుతోంది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై గునీత్ మోంగాతో కలిసి హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో రిలీజ్ కాబోతోంది. ఏయిర్ డెక్కన్ ఫౌండర్ జి.ఆర్‌. గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
గత కొంత కాలంగా సెలెక్టీవ్‌గా మాత్రమే సినిమాలు చేస్తూ వస్తున్న కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆయన వాయిస్‌తోనే రిలీజ్ కావడంతో మోహన్‌బాబు క్యారెక్టర్‌కు ఈ సినిమాలో ఎంత ప్రాధాన్యత వుందో అర్థమవుతోంది. ఇందులో మోహన్‌బాబు భక్త వత్సలం నాయుడు అనే పాత్రలో సీనియర్ ఏయిర్ ఫోర్స్ అధికారిగా నటిస్తున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర బృందం మోహన్‌బాబు లుక్‌ని శుక్రవారం విడుదల చేసింది.

For more news :

Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *