ఈ ‘హ్యాపీనెస్’ చాల ఇచ్చింది: మెలానియా

Spread the love

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య.. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, కూతురు ఇవాంకా, ఆమె భర్త తమ భారత పర్యటన ముగించి ఫిబ్రవరి 25 న తమ దేశ అమెరికాకు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికా చేరుకున్నప్పటి నుండి, ఇవాంకా మరియు మెలానియా భారతదేశం గురించి తమ అనుభవాలను సోషల్ మీడియాలో నిరంతరం పంచుకుంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌లో హ్యాపీనెస్‌ క్లాస్‌ సెషన్‌కు హాజరవడం మరిచిపోలేని అనుభూతిగా అమెరికా తొలి మహిళ మెలానియా ట్రంప్‌ అభివర్ణించారు.
తనకు స్కూల్‌లో సాదర స్వాగతం పలికిన అద్భుత చిన్నారులు, ఫ్యాకల్టీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. స్కూల్‌లో చిన్నారుల మధ్య తాను గడిపిన క్షణాలతో కూడిన వీడియోను సోషఃల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేశారు. తన భర్త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెంట భారత్‌ పర్యటనకు వచ్చిన మెలానియా ఢిల్లీలోని సౌత్‌ మోతీబాగ్‌లోని సర్వోదయ పాఠశాలను మంగళవారం సందర్శించి అక్కడి చిన్నారులతో ముచ్చటించిన సంగతి తెలసిందే. ఇరు దేశాల జెండాలను చేబూనిన విద్యార్ధులు ఆమెకు సంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు. దీంతో వారి గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఈ సంప్రదాయ స్వాగతాన్ని చూసి మెలానియా ఉద్వేగానికి లోనయ్యారు. అమెరికా వెళ్లిన తరువాత ఈ పాఠశాలలో దిగిన ఫోటోలను ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. సర్వోదయ స్కూల్‌లో హ్యాపీనెస్‌ క్లాస్‌ సెషన్‌కు హాజరవడం మరిచిపోలేని అనుభూతిగా అభివర్ణించారు.

For more news :

Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *