‘జగన్‌ను చూస్తే తనకు జాలేస్తోందట’.. ఇందుకేనా.?

Spread the love

చంద్రబాబు తనయుడు ఏదో రకంగా ఎప్పుడు వార్తాల్లో నిలుస్తుంటాడు. అదే రీతిలో ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఎలా అనుకుంటున్నారా.? సీఎం జగన్పై వ్యగ్యంగా ట్వీట్ చేశాడు మాజీ మంత్రి నారా లోకేష్. సోషల్ మీడియాలో ఎప్పుడూ వైసీపీ ప్రభుత్వంతో పాటు… సీఎం జగన్‌పై సెటైర్లు , విమర్శలు చేసే లోకేష్ మరోసారి ట్విట్టర్ వేదికగా జగన్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను చూస్తే జాలేస్తోందన్నారు నారా లోకేష్. శుక్రవారం వచ్చేసరికి కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయాలా అని జగన్ స్కూల్‌ పిల్లాడిలా సాకులు వెతుక్కోవాల్సి వస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. వారంలో మిగిలిన రోజులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పబ్జీ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నజగన్‌ … శుక్రవారం వచ్చేసరికి తాను సీఎంనని గుర్తుకు వచ్చి ఏదో పర్యటనో, రివ్యూనో పెట్టి కోర్టుకు రాలేనంటూ కబురు పంపుతుంటారని వ్యగ్యంగా ట్వీట్ చేశారు. మరోవైపు సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను సీబీఐ,ఈడీ కోర్టు మార్చి 6కి వాయిదావేసింది. ఈకేసులో నిందితులుగా ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి తదితరులు ఇవాళ కోర్టుకు హాజరయ్యారు.

For more news :

Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *