అదే జోరు.. ‘బంగ్లా’ చిత్తు
భారత మహిళల జట్టు జోరు పెంచింది.. అదే జోష్ తో ముందు ‘బంగ్లా’ను సైతం చిత్తు చేశారు మన లేడీ సింహాలు. తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జోష్‌లో ఉన్న హర్మన్ సేన ఈసారి బంగ్లాదేశ్‌ను ఆటాడుకుంది. తద్వారా ఈ జట్టుతో జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. ఆరంభంలో చిచ్చరపిడుగు షఫాలీ వర్మ భారీ సిక్సర్లతో వాకా మైదానాన్ని హోరెత్తించగా.. ఆఖర్లో వేద కృష్ణమూర్తి వేగంగా ఆడి పరుగులను రాబట్టింది. దీంతో తాజా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాత బౌలర్లు సమష్టిగా దెబ్బతీయడంతో డెత్ ఓవర్లలో బంగ్లా పూర్తిగా తడబడింది. లెగ్ స్పిన్నర్ పూనమ్ మూడు వికెట్లతో మరోసారి మ్యాజిక్ చేసింది.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో హర్మన్‌ప్రీత్ సేన మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. లీగ్ మ్యాచ్‌ల్లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సోమవారం పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 18 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు మరోసారి సత్తా చాటడంతో.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ మరో విజయం సొంతం చేసుకుంది. భారత బౌలర్లు మరోసారి సత్తా చాటడంతో.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ మరో విజయం సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ 17 బంతుల్లో 39 పరుగులు, జెమిమా రోడ్రిగ్స్ 37 బంతుల్లో 34 పరుగులతో రాణించారు.
అనంతరం బరిలోకి దిగిన బంగ్లా లక్ష్య ఛేదన క్రమంలో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేసింది. భారత బౌలర్లలో స్పిన్నర్ పూనమ్ యాదవ్ (3/18) తన స్పిన్ తంత్రాన్ని ప్రత్యర్థికి రుచిచూపింది. భారత బౌలర్లలో స్పిన్నర్ పూనమ్ యాదవ్ (3/18) తన స్పిన్ తంత్రాన్ని ప్రత్యర్థికి రుచిచూపింది. దీంతో వరుసగా రెండు మ్యాచ్ ను గెలవడంతో ఫైలన్ సునాయాసంగా చేరుకున్న అవకాశాలున్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
For more news :
Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter