అదే జోరు.. అగ్రస్థానంలో ఇండియా

Spread the love

మహిళ టీ20 వరల్డ్ కప్ లో ఇండియా టీం అదే జోరును కొనసాగిస్తుంది. ప్రత్యర్థి ఎవ్వరైనా సరే.. మట్టి కరిపించేస్తున్నారు. వరుస విజయాలతో రికార్డుల మోత మోగిస్తున్నారు. శనివారం మెల్‌బోర్న్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో లంక జట్టును చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో ప్రపంచకప్ గ్రూప్ ఏ పట్టికలో 8 పాయంట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టోర్నీలో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. నాలుగింటిలోనూ టీమిండియా గెలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఐతే ఆరంభం నుంచే వరుస వికెట్లు కోల్పోయిన శ్రీలంకను.. కెప్టెన్ చమారి ఆటపట్టు ఆదుకుంది. 24 బంతుల్లో 33 రన్స్ చేసి రనౌటయింది. ఆ తర్వాత ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. చివర్లో కవీషా దిల్హారి మెరుపులు మెరిపించింది. 16 బంతుల్లో 25 పరుగులు చేయడంతో లంక గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 4, రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు పడగొట్టారు. దీప్తి శర్మ, శిఖా పాండే, పూనమ్ యాదవ్ తలో వికెట్ సాధించారు.
120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ షఫాలీ వర్మ మరోసారి మెరుపులు మెరిపించింది. 34 బంతుల్లో 47 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. స్మృతి మంధనా 17, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 15, రోడ్రిగ్స్ 15, దీప్తి శర్మ 15 పరుగులు చేశారు. లక్ష్యంతో తక్కువగా ఉండడం.. షఫాలీ ధాటిగా ఆడడంతో.. మిగతా ప్లేయర్స్ ఆడుతూ పాడుతూ టార్గెట్‌ ఛేదించారు. ఇక గ్రూప్-ఏలో టాప్‌లో ఉన్న భారత్.. గ్రూప్-బీలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడనుంది.

For more news :

Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *