దేశంలో కోవిడ్ కల్లోలం.. కోవిడ్ తో 24 గంటల్లో 257 మంది మృతి

Spread the love

కరోనా కలవరం: 60వేలకు చేరువగా కేసులు
257 మంది మృతులు..4లక్షలకు పైగా బాధితులుదేశంలో కరోనా విజృంభిస్తోంది. సెకండ్‌ వేవ్ ఆందోళనకర రీతిలో కొనసాగుతోంది. తీవ్రస్థాయిలో పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 59 వేల 118 కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ కారణంగా 257 మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది అక్టోబర్ తర్వాత ఆస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటి 18లక్షలు దాటాయి. కోవిడ్ కారణంగా ఇప్పటి వరకు లక్షా 60 వేల 949 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 లక్షలు దాటింది. రికవరీ రేటు 95 శాతంగా ఉంది.
మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 35 వేల 952 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 111 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశం మొత్తం మీద 4 లక్షల 21 వేల యాక్టివ్ కేసులు ఉండగా….ఒక్క మహారాష్ట్రలోనే 2 లక్షల 64 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు 26 లక్షలు దాటాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.
ఇప్పటి వరకు 5 కోట్ల 55 లక్షల మందికి కరోనా టీకా అందించారు.

  • దేశంలో విజృంభిస్తున్న కరోనా
  • ఆందోళనకర రీతిలో కొనసాగుతున్న సెకండ్‌ వే
  • గడచిన 24 గంటల్లో 59 వేల 118 కేసులు నమోదు
  • కోవిడ్ తో 24 గంటల్లో 257 మంది మృతి
  • గత ఏడాది అక్టోబర్ తర్వాత ఆస్థాయిలో కేసులు నమోదు
  • దేశంలో కోటి 18లక్షలు దాటిన కరోనా కేసులు
  • కరోనాతో ప్రాణాలు కోల్పోయిన లక్షా 60 వేల 949 మంది
  • దేశంలో 4 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
  • మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం
  • నిన్న ఒక్కరోజే 35 వేల 952 కొత్త కేసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *