కోహ్లీ సేనా.. మళ్లీ అదే బాట

Spread the love

భారత బ్యాట్స్‌మెన్‌ మరోసారి న్యూజిలాండ్‌ బౌలర్లకు తలొగ్గారు. కనీసం పోరాటపటిమను కూడా ప్రదర్శించుకుండా నిర్లక్ష్యంగా వికెట్లను పారేసుకున్నారు. దీంతో రెండో టెస్టు కూడా టీమిండియా చేతుల్లోంచి దాదాపు చేజారి వైట్‌వాష్‌కు ద​గ్గరైంది. ఏడు పరుగుల స్వల్ప ఆధి​క్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని 97 పరుగుల లీడ్‌లో టీమిండియా ఉంది. ప్రస్తుతం హనుమ విహారీ (5 బ్యాటింగ్‌), పంత్‌ (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. బౌలింగ్‌లో కివీస్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (3/12) మరోసారి తన పేస్‌ రుచిచూపించగా.. గ్రాండ్‌హోమ్‌, వాగ్నర్‌,సౌతీలు తలో వికెట్‌ పడగొట్టారు.
మారని తీరు..
కివీస్‌ టెయిలెండర్లు సైతం సులువుగా పరుగులు రాబట్టిన చోట భారత బ్యాట్స్‌మన్‌ ఘోరంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం లభించిందన్న సంబరం కొన్ని నిమిషాలకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా దారుణంగా విఫలమైంది. స్కోర్‌ బోర్టులో పరుగుల కంటే వేగంగా వికెట్లు పడ్డాయి. పిచ్‌ ప్రభావం.. కివీస్‌ బౌలర్ల ప్రతిభ అనడంకంటే భారత బ్యాట్స్‌మెన్‌ నిర్లక్ష్యం, తొందరపాటు అని చెప్పాలి. తొలుత మయాంక్‌ అగర్వాల్‌(3)ను బౌల్ట్‌ బోల్తాకొట్టించగా.. సౌథీ బౌలింగ్‌లో పృథ్వీషా(14) తొందరపడ్డాడు. అనంతరం గ్రాండ్‌హోమ్‌ బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లి (14) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో ఔటైన విధంగానే రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఔటవ్వడం గమనార్హం.

For more news :

Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *