‘ఇల్లీబేబి’.. మళ్లీ ఊపేస్తుందిగా..
నడుము అందాలు తెలుగు కుర్రాళ్లకు తెలియనివి కావు. ఈ ముద్దుగుమ్మ.. దేవదాసు చిత్రం ద్వారా పరిచయమై.. పోకిరితో సూపర్ హిట్ అందుకుంది. అప్పటి నుంచి తెలుగులో తన సినిమాలతో ఊపేసింది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే హిందీ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి హిట్లు అందుకుంది. కాగా ఆ మధ్య సన్నగా మారిన ఇలియానా మళ్లీ కొంచెం బొద్దుగా కనపడుతోంది. అయినా కూడా తన అందచందాలతో ఆకర్షిస్తోంది. అవకాశాల కోసం ఏదో ఒక విధంగా ట్రై చేస్తూనే ఉంది. మాస్ మహారాజా రవితేజ నటించిన దేవుడు చేసిన మనుషులు
చిత్రం తరువాత టాలీవుడ్‌కు టాటా చెప్పేసిన ఈ హాటీ బర్ఫీ
సినిమాతో బాలీవుడ్ బాట పట్టేసింది. అక్కడ తన క్రేజ్‌కి తగ్గ ఆఫర్లు వస్తాయని ఆశపడింది కానీ ఏ ఒక్క బిగ్ హీరో తనతో సినిమా చేయడానికి ఆసక్తిని చూపించలేదు.
దాంతో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో డేటింగ్ మొదలు పెట్టి బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఆండ్రూతో బ్రేకప్ తరువాత మళ్లీ సినిమాలపై దృష్టిసారించినా చెప్పుకోదగ్గ ఆఫర్ల రావడం లేదు. దీంతో బాలీవుడ్ మేకర్స్‌ని ఇంప్రెస్ చేయడం కోసం సోషల్ మీడియా వేదికగా ఈ భామ చేసే రచ్చ అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఒకేసారి సడెన్‌గా బికినీ షోలతో మతిపోగొడుతుంది. ఇలియానా తాజాగా సోషల్ మీడియలో పోస్ట్ చేసిన బికినీ ఫొటోలు ఇంటర్నెట్‌ని హీటెక్కించేస్తున్నాయి. ఈ హాట్ షోకి క్లీన్ బౌల్డ్ అయి ఏ హీరో, లేదా డైరెక్టర్ అయినా ఇలియానాకు ఆఫర్ ఇస్తాడేమో చూడాలి మరి. అన్నట్టు ఇలియానాకు అజయ్‌దేవగన్ వరుస ఆఫర్లు ఇస్తున్నాడు. రైడ్, బాద్షాహో వంటి చిత్రాల్లో తనకు జోడీగా అవకాశం ఇచ్చిన అజయ్ తాజాగా అభిషేక్‌బచ్చన్ హీరోగా తానే స్వయంగా నిర్మిస్తున్న బిగ్ బుల్
చిత్రంలో హీరోయిన్గా ఆఫరిచ్చాడు. హర్షద్ మెహతా హవాలా కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మరి ఓ పక్క ఆఫర్లు అందుకుంటూనే మరిన్ని ఆఫర్ల కోసం ఈ బికినీ షోలు మొదలుపెట్టింది. ఈ భామ మళ్లీ తన సెకెండ్ ఇన్నింగ్స్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
For more news :
Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter