హైదరాబాద్ లో బాలిక కిడ్నాప్..ఆచూకీ లభ్యం | 6TV

Spread the love
  • అబ్దుల్లాపూర్ మెట్ లో బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం
  • బాలిక ఆచూకీ లభ్యం..పోలీసుల అదుపులో కిడ్నాపర్
  • తట్టి అన్నారానికి చెందిన ముస్కాన్ అనే బాలిక కిడ్నాప్
  • సోమవారం మధ్యాహ్నం బాలిక కిడ్నాప్ అయినట్లు గుర్తించిన ముస్కాన్ తండ్రి
  • బాలిక కోసం గాలించిన 30 మంది పోలీసుల బృందం
  • ఆర్కే నగర్ కు చెందిన రాజు బాలికను కిడ్నాప్ చేసినట్లు గుర్తింపు
  • హయత్ నగర్ కాలనీలో బాలిక ఆచూకీ లభ్యం

హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో బాలిక కిడ్నాప్ సుఖాంతమైంది. తట్టి అన్నారానికి చెందిన ముస్కాన్ అనే బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. సోమవారం మధ్యాహ్నం బాలిక కిడ్నాప్ అయినట్లు గుర్తించిన ముస్కాన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 30 మంది బృందంతో గాలించారు. తట్టి అన్నారంలో ఓ షాపు వద్ద సీసీ కెమేరాలో ఓ వ్యక్తి వద్ద బాలిక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

సీసీ ఫుటేజిలో ఉన్న వ్యక్తిని బాలిక తండ్రి గుర్తించాడు. ఆర్కే నగర్ కు చెందిన రాజు బాలికను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. అతడు హయత్ నగర్ కాలనీలో బాలిక తిరుగుతుండగా పోలీసులు గుర్తించారు. సినిమా చూపిస్తా అని చెప్పి బాలికను తీసుకెళ్లినట్లు తెలిసింది. కిడ్నాప్ చేసిన వ్యక్తిని పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *