మత పెద్ద చేసిన పనికి ఆ దేశం కరోనా కి బలౌతుంది ….

Spread the love

దేశంలోకి కరోనా వైరస్ తన వల్లే వచ్చిందంటూ దక్షిణ కొరియాకు చెందిన ఓ మతపెద్ద క్షమాపణ కోరాడు. ఆయన స్థాపించిన చర్చి నిర్వహించిన కార్యక్రమంలో ఓ 61ఏళ్ల మహిళ పాల్గొంది. అయితే అప్పటికే ఆమెకు కరోనా సోకింది. ఈ విషయం తెలియని సదరు చర్చి నిర్వాహకులు ఆమెను కార్యక్రమంలో పాల్గొననిచ్చారు. ఆ తర్వాతే దక్షిణ కొరియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. అయితే ఈ చర్చి వ్యవస్థాపకుడు, స్వయం ప్రకటిత భగవత్ స్వరూపుడు లీ మాన్ హీ మాత్రం కరోనా పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించారు.

ఈ పరీక్షలకు అంగీకరించకపోతే అతన్ని అరెస్టు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయించుకున్న ఆయనకు వైరస్ సోకలేదని తేలింది. ఈ నేపథ్యంలో తన వల్లే దేశంలోకి కరోనా వచ్చిందని లీ బాధపడ్డారు. కరోనా వ్యాప్తిని ‘భయంకరమైన విపత్తు’గా అభివర్ణించిన ఆయన.. తనను మన్నించాలంటూ తల నేలకానించి క్షమాపణ కోరాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *