కూతురిని చితకబాది.. గుండుకొట్టించి..

Spread the love

కంటికి రెప్పల చూసుకోవాల్సిన తండ్రే కసాయిగా మారాడు. చిన్న తప్పుకే ఊగిపోయి చావబాదాడు. అంతటితో ఆగకుండా నడ్డి రోడ్డుపై అందరూ చూస్తుండగానే గొంటి కొట్టించాడు. ఇంతటి అమానుష ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. అలీరాజ్‌పూర్‌కి చెందిన ఓ మైనర్ బాలిక, తనకు తెలిసిన యువకుడితో ఫోన్ లో మాట్లాడుతూ ఉండటాన్ని ఆమె తల్లిదండ్రులు గమనించారు. దీంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కన్న బిడ్డని, అసలు ఏమైందో తెలుసుకోవాలని కూడా ఆలోచించకుండా తప్పు చేశావంటూ దాడికి దిగారు. దారుణంగా చావబాది నడిరోడ్డుపైకి లాక్కొచ్చారు.
ఇకపై అబ్బాయితో మాట్లాడనని.. తనను క్షమించాలని ఆమె వేడుకున్నా కనికరం చూపకుండా.. అందరూ చూస్తుండగానే గుండు కొట్టించారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరలైంది. వీడియో ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశామని, దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు. రోజురోజుకూ మానవతా విలువలు పడిపోతున్నాయనడానికి ఇదో నిదర్శనం.

For more news :

Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *