ఇరాన్లో ‘మహమ్మారి’ కలవరం!
కోవిడ్-19 (కరోనా వైరస్) చైనాను గడగడలాడిస్తోంది. అయితే ఈ మహమ్మారి ఒక చైనాకే పరిమితం కాలేదు. మిగతా దేశాలకు సైతం వ్యాపించింది. ఇప్పుడు అలాంటి దేశాలు సైతం గజగజ వణికిపోతున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌ను నిలువునా వణికిస్తోంది. శనివారం ఆ దేశంలో కొవిడ్-19తో తొమ్మిది మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 43కు పెరిగింది. నిర్ధారిత కేసులు 593కు చేరాయి. ఈ నేపథ్యంలో వేలాది మందికి వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు వైర్‌సతో ఇరాన్లో ఏకంగా 210 మంది చనిపోయినట్లు ఆసుపత్రుల వర్గాలను ఉటంకిస్తూ బీబీసీ చెబుతోంది. అయితే, ఇదంతా అబద్ధమని వైద్య శాఖ ప్రతినిధి కియానౌష్ జహన్‌పూర్ ఖండించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందం ఆది లేదా సోమవారాల్లో ఇరాన్ రానుంది.
కాగా, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. కరోనా లక్షణాలున్న వ్యక్తిని కాల్చి చంపించినట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలోకి వైరస్ ప్రవేశిస్తే సహించేది లేదని అధికారులకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కొరియాలో శనివారంతో నిర్ధారణ కేసులు 3,150 దాటాయి. మృతుల సంఖ్య 17కు చేరింది. కాగా.. చైనాలో 47 మంది మరణించారు. ఈ రెండు దేశాల్లోనూ వైరస్ రీ ఇన్ఫెక్షన్ ఉదంతాలు వెలుగుచూస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్త మరణాల సంఖ్య 2,924కు చేరడంతో ‘కరోనా వ్యాప్తి ముప్పు, ప్రభావం తీవ్రతను మరింత స్థాయికి’ పెంచినట్లు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ ఘెబ్రెయెసస్ తెలిపారు.
అమెరికాలో తొలి కోవిడ్-19 మృతి
అమెరికాలో కోవిడ్-19 వైరస్‌తో మృతి చెందిన తొలి కేసు నమోదైంది. వాషింగ్టన్ రాష్ట్రంలో శనివారం కోవిడ్-19 కారణంగా ఓ వ్యక్తి మృతి చెందినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ వైరస్‌ను నిర్మూలించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శనివారానికి అమెరికాలో 66 కోవిడ్-19 కేసులు నమోదయినట్లు అధికారులు పేర్కొన్నారు.
For more news :
Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter