Corona Virus :కరోనా విలయ తాండవం..అమెరికా తరువాత ఇండియానే | 6TV
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజులో లక్షకుపైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు తగ్గినట్లే తగ్గుతూ కొత్త కోరలు తొడుక్కుంటున్న మహమ్మారి, యావత్ మానవాళికే పెనుసవాలు విసురుతోంది. ఈ స్థాయిలో వైరస్ ప్రకోపం అమెరికా తరవాత ఇండియాలోనే ఉంది. దేశంలో కరోనా మహమ్మారి గతంలో కంటే మరింత తీవ్రతతో వేగంగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకమని సెకండ్ వేవ్ కట్టడిలో ప్రజా భాగస్వామ్యమే ముఖ్యమని తెలిపింది. దేశంలో మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్ గఢ్‌లో పరిస్థితి తీవ్రంగా ఉందని, జనాభా, విస్తీర్ణంలో చిన్న రాష్ట్రాలైన ఛత్తీ్‌సగఢ్, పంజాబ్‌లలో మరణాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. కేసులు అధికంగా నమోదవుతూ, మరణాలు అధికంగా ఉన్న కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రకు 50 అత్యున్నత బృందాలను పంపినట్లు అధికారులు వివరించారు.