దేశంలో తొలిసారి ఒక్క‌రోజులో ల‌క్ష మందికిపైగా క‌రోనా నిర్ధార‌ణ | Corona Second Wave | 6TV

Spread the love


ఇంతకు ముందెన్నడూ లేని తీవ్రత..రికార్డు స్థాయిలో కొత్త కేసులు
దిల్లీ: భారత్‌లో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,03,558 మందికి పాజిటివ్‌గా తేలింది. మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టి సుమారు 14 నెలలు కావొస్తున్నా..ఈ స్థాయిలో కొత్త కేసులు ఎన్నడూ నమోదు కాలేదు. గతేడాది కరోనా మొదటి దశలో గరిష్ఠంగా 97,894 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 1,25,89,067కి చేరాయి. వైరస్ ఉద్ధృతి పెరుగుతుండటంతో.. కొవిడ్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య 7,41,830కి పెరిగింది. క్రియాశీల రేటు 5.89కి చేరింది. ఇదిలా ఉండగా.. నిన్న 8,93,749 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆదివారం కావడంతో పరీక్షల సంఖ్య తగ్గినప్పటికీ, కేసుల్లో భారీ పెరుగుదల పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇంత ఉద్ధృతిలోని రికవరీలు ఊరటనిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 52,847 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 1,16,82,136కి చేరగా..ఆ రేటు 92.80 శాతానికి పడిపోయింది. తాజాగా 478 మంది మృత్యుఒడికి చేరగా..మొత్తంగా 1,65,101 మంది ప్రాణాలు వదిలారు. ఈ ఏడాదిలో ఒక దశలో 700పై చిలుకు మరణాలు సంభవించాయి. కొత్తగా వైరస్ బారిన పడుతోన్న వారి సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ..మరణాలు అదుపులోనే ఉండటం సానుకూల పరిణామం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *