విద్యార్థుల మధ్య ఘర్షణ

Spread the love

వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ రణరంగాన్ని తలపించింది. ఆర్కే వ్యాలీ లో మూడో ఏడాది, నాలుగో ఏడాది ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ విద్యార్థి….ఫోర్త్ ఇయర్ అమ్మాయిని తప్పుగా కామెంట్ చేశాడన్న కోపంతో…నాలుగో ఏడాది విద్యార్థులు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ పై దాడికి దిగారు.
మూడు రోజుల నుంచి వేచి చూసిన సీనియర్ విద్యార్థులు…. E3 విద్యార్థి ని టార్గెట్ గా చేసి గొడవ సృష్టించారు. E3, E4 విద్యార్థులు ఒకరినొకరు కట్టెలతో కొట్టుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల విద్యార్థులను చెదరగొట్టారు. వేరు వేరు గదుల్లో థర్డ్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులను ఉంచారు. ఇరు వర్గాలకు పోలీసు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘర్షణలో ఐదుగురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.

  • విద్యార్థుల మధ్య ఘర్షణ
  • ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ
  • ఆర్కే వ్యాలీ లో మూడు, నాలుగో ఏడాది ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య వివాదం
  • సీనియర్ విద్యార్థినిని తప్పుగా అన్నాడని..థర్డ్ ఇయర్ స్డూడెంట్స్ పై సీనియర్ల దాడి
  • కర్రలతో కొట్టుకున్న విద్యార్థులు…ఐదుగురికి గాయాలు
  • వేరు వేరు గదుల్లో థర్డ్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులు
  • విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసు అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *