హైదరాబాద్ రౌడీ షీటర్ పై కేసు..Case Filed On Rowdy sheeter junglee Yousuf | 6TV

Spread the love

హైదరాబాద్ లోని రౌడీషీటర్ మొహమ్మద్ యూసఫ్ అలియాస్ జంగ్లీ యూసఫ్ పై.. హబీబ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్న సమయంలో బహిరంగంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంపై జంగ్లీ యూసఫ్ పై కేసు నమోదైంది. గత నెల 23న యూసఫ్ పుట్టినరోజు వేడుకల్లో ఎలాంటి సోషల్ డిస్టెంట్స్ పాటించలేదు.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు చర్యలకు పూనుకున్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం ఐపీసీ 336, 278 ఐపీసీ 188 సెక్షన్ 15 కింద కేసు నమోదు చేశారు. ఎవరైనా కోవిడ్ నియమాలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *