బంద్ కు పిలుపునిచ్చిన కిసాన్ సంయుక్త మోర్చా
నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నాయకులతో పలు ధపాలు చర్చలు జరిపినప్పటికీ ఆచర్చలు విఫలమయ్యాయి. మరోవైపు.. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత రైతు సంఘాల సమన్వయ సమితి ఈనెల 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఇక ఈ బంద్‌కు అన్నీ పార్టీలు మద్దతు తెలపాలని వామపక్ష నేతలు కోరారు.
ఇక రైతు సమస్యల పరిష్కారంపై మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని వామపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడమేగాక.. అంబానీ, ఆదానీలకు పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు. బంద్ ను జయప్రదం అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నారు. అటు నూతన వ్యవసాయ చట్టాలను తిప్పి కొట్టేందుకు ప్రజలంతా బంద్‌లో పాల్గొనాలని విజ్నప్తి చేశారు.
- బంద్ కు పిలుపునిచ్చిన కిసాన్ సంయుక్త మోర్చా
- ఇప్పటికే మద్దతు ప్రకటించిన టీడీపీ
- తాజాగా ప్రభుత్వ వైఖరి వెల్లడించిన పేర్ని నాని
- మధ్యాహ్నం ఒంటిగంట వరకు బస్సుల నిలిపివేత