ప్రేమ ఒప్పుకోలేదని.. జవాన్ కాల్పులు

Spread the love

ప్రేమ వేధింపులు రోజూ వింటూనే ఉంటాం. ప్రేమ ఒప్పుకోలేదని గొంతు కోయడం, యాసిడ్ దాడి చేయడం నిత్యం అక్కడో ఓ చోటు జరుగుతూనే ఉంటుంది. అయితే అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన ఆర్మీ జవాన్ చేయడంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. గుంటూరు జిల్లాలోని చెరుకుపల్లి మండలం నడింపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రమాదేవి అనే మహిళపై ఆర్మీ జవాన్ బాలాజీ కాల్పులు జరిపాడు. రమాదేవి కూతురిని ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా బాలాజీ వెంటపడుతున్నాడు. అయితే ఇందుకు రమాదేవి ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న బాలాజీ… ఉదయం ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చి కాల్పులు జరిపాడు. నాటు తుపాకీ కాల్పులు జరిపి రమాదేవిని చంపేందుకు యత్నించాడు. అయితే అతడి ఘాతుకాన్ని ముందుగానే పసిగట్టిన మహిళ… ప్రమాదం నుంచి తప్పించుకుంది.
అయితే ఈ ఘటనలో ఆమె కుడి చెవికి బుల్లెట్ గాయమైంది. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో బాలాజీ అక్కడి నుంచి పరారయ్యాడు. అతడికి సహకరించిన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు… ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

For more news : Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *